మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా కూతుర్ల విషయంలో వివాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే ఇక ఈయన మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా వివాదం సృష్టించాయి. అయితే తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి తన బ్రదర్ నాగబాబు తల్లి అంజనమ్మ, చెల్లెళ్లు విజయ దుర్గ, మాధవిలతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్లో తన తల్లి అంజనమ్మ గురించి అలాగే తన చిన్న కూతురు శ్రీజ కష్టాల గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు చిరంజీవి. ఆయన మాట్లాడుతూ.. మా అమ్మకి అందరిలో నాగబాబు అంటేనే ఇష్టం. నాగబాబుని ఇప్పటికి కూడా దగ్గరకు తీసుకొని నుదుటిపై ముద్దు పెడుతుంది.అలాగే నా చిన్న కూతురు శ్రీజ విడాకుల తర్వాత ఎన్నో ఇబ్బందులు పడింది.రెండుసార్లు విడాకులతో ఆమె చాలా డిప్రెషన్ లోకి కూడా వెళ్ళింది.
కానీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం మా అమ్మనే.శ్రీజ తన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ముందుగా తన నానమ్మ సలహాలే తీసుకుంటుంది.అలా మా తల్లి అంజనమ్మ సలహాలు తీసుకొని శ్రీజ ముందుకు వెళుతుంది.. ఇక విడాకుల గురించి నా తల్లి అంజనమ్మ దగ్గర శ్రీజా ఈ విషయం చెప్పిన సమయంలో ఎవడో ఒకడి గురించి నీ లైఫ్ ఇక్కడితో ఆగిపోకూడదు.నువ్వు ముందుకు వెళ్లాలి అంటూ శ్రీజలో ధైర్యాన్ని నింపింది మా అమ్మ. అందుకే శ్రీజ ఏ విషయమైనా సరే ముందుగా తన నానమ్మతోనే చర్చిస్తుంది. అలాగే చిన్నప్పటినుండి మా అమ్మ మాలో కూడా ఎంతో ధైర్యాన్ని నింపేది..
అంటూ శ్రీజా విడాకుల తర్వాత పడిన కష్టాల గురించి మొదటిసారి మాట్లాడారు మెగాస్టార్ చిరంజీవి.. ఇక మెగా డాటర్ శ్రీజ మొదట లేచిపోయి పెళ్లి చేసుకుంది.ఇక శిరీష్ భరద్వాజ్ తో ఒక పాప పుట్టాక డబ్బు కోసం ఆయన హింసించడంతో తిరిగి తండ్రి దగ్గరికి చేరింది. ఆ తర్వాత శిరీష్ కి విడాకులు ఇచ్చి తల్లిదండ్రులు చూసిన కళ్యాణ్ దేవ్ అనే అబ్బాయిని పెళ్లాడుంది. ఇక వీరి సంసార జీవితం బాగానే ఉన్నప్పటికీ చివరికి వీరి సంసారంలో కూడా కలతలు ఏర్పడి విడాకులు తీసుకున్నారు. అలా శ్రీజ ప్రస్తుతం ఇద్దరికీ విడాకులు ఇచ్చి ఇద్దరు కూతుర్లతో కలిసి చిరంజీవి ఇంట్లోనే ఉంటుంది. ఇక రీసెంట్ గానే తన ఫ్రెండ్స్ తో కలిసి శ్రీజ సీసా స్పేసెస్ సెంటర్ అనే స్కూల్ ని ప్రారంభించింది.