అనిల్-చిరంజీవి సినిమాలో అద్దిరిపోయే హీరోయిన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్..!?

Thota Jaya Madhuri
అనిల్ రావిపూడి ..ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్న సరే అది జనాలను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది . ఈ మధ్యకాలంలో స్టార్ డైరెక్టర్స్ కూడా సినిమాని హిట్ కొట్టలేక పోతున్నారు . అయితే చాలా సింపుల్ కాన్సెప్ట్ తక్కువ బడ్జెట్ తో అనిల్ రావిపూడి ఎలా సినిమాని హిట్ చేసేలా సంక్రాంతికి వస్తున్నాం మూవీని మార్చేశారో అందరికీ తెలిసిందే. రీసెంట్గా అనిల్ రావిపూడి "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడో అందరికి తెలిసిందే.


ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా అంటూ కూడా టాక్ వినిపించింది . ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ పాత్ర హైలెట్ గా మారింది . అనిల్ రావిపూడి ఆ విధంగా ఐశ్వర్య రాజేష్ పాత్రని డిజైన్ చేశాడు అంటూ కూడా మాట్లాడుకున్నారు. ఐశ్వర్య రాజేష్ కెరియర్ లోనే ఇది ఒక బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అని చెప్పాలి.  ఇప్పుడు అందరి చూపు చిరంజీవి పైకి వెళ్ళింది . త్వరలోనే అనిల్ రావిపూడి మరో హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఇప్పుడు చిరంజీవి - అనిల్ కాంబోలో సినిమా రాబోతుంది.


అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని పెట్టుకుంటారు అనేది అభిమానులు బాగా చర్చించుకుంటున్నారు.  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం . ఈ సినిమాలో మన్మధుడు హీరోయిన్ "అన్షు"ని హీరోయిన్గా పెట్టుకోవాలి అంటూ డిసైడ్ అయ్యారట . రీసెంట్ గానే మజాకా సినిమాతో మంచి కం బ్యాక్ హిట్ అందుకుంది అన్షు. ఇప్పుడు ఆమెకు బోలెడని ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి . అయితే ఇదే మూమెంట్ లో ఓ న్యూస్ బయట పడ్డింది. అన్షుని ని చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారట . ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: