"అమ్మో ఇక నా వల్ల కాదు".. ఆ హీరోయిన్ తో స్టెప్స్ వేయలేక అల్లాడిపోయిన జూనియర్ ఎన్టీఆర్..!

frame "అమ్మో ఇక నా వల్ల కాదు".. ఆ హీరోయిన్ తో స్టెప్స్ వేయలేక అల్లాడిపోయిన జూనియర్ ఎన్టీఆర్..!

Thota Jaya Madhuri
జూనియర్ ఎన్టీఆర్ ..సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో అనే చెప్పాలి . జూనియర్ ఎన్టీఆర్ గురించి ముందుగా మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన మాస్ డైలాగ్ డెలివరీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అభిమానులు . ఆయన ఇండస్ట్రీలో డైలాగ్స్ చెప్పిన్నట్లు మరి ఏ హీరో కూడా చెప్పలేరు . అది ఆయన కన్నా సీనియర్ హీరో అయినా సరే ..జనాలు, నందమూరి ఫ్యాన్స్  ఇదేవిధంగా ఎక్కువుగా  మాట్లాడుకుంటూ ఉంటారు . ప్రెసెంట్ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతుంది.



ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్లు  చాలా చాలా ఎక్కువుగా ఉన్నారు. మరి ముఖ్యంగా ఆయన వేసే స్టెప్స్ ను క్యాచ్ చేయడం చాలా కష్టం . ఎంత టఫ్ స్టెప్ అయినా సరే కేవలం ఒక్క టేక్ లోనే ఓకే చేయడం జూనియర్ ఎన్టీఆర్ స్పెషాలిటీ . అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ని సైతం ఓ హీరోయిన్ డ్యాన్స్ విషయం లో ఇబ్బందులు పెట్టేసిందట . "అమ్మో ఇక నావల్ల కాదు ..ఈమెతో నేను డ్యాన్స్ చేయలేను అంటూ డైరెక్టర్ కి చెప్పేసారట". ఆమె ఎవరో కాదు "రంభ"..



సీనియర్ హీరోయిన్ రంభ . ఆమె యమదొంగ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ స్టెప్స్ వేరే లెవెల్ లో ఉంటాయి . అప్పట్లో ఈ సాంగ్ పెద్ద హైలెట్ గా మారింది . అయితే ఈ సాంగ్ చేస్తున్నప్పుడు రంభ స్పీడ్ ని క్యాచ్ చేయలేకపోయాడట జూనియర్ ఎన్టీఆర్ . ఈ మూమెంట్లోని ఈమెతో స్టెప్స్ నావల్ల కాదు బాబోయ్ అంటూ రాజమౌళికి మొరపెట్టుకున్నాడట . కానీ రాజమౌళి భలే మొండోడు.  అందుకే అనుకున్నది సాధించి ఆ సినిమాలోని సీన్స్ ..డ్యాన్స్ స్టెప్స్ ఆయనకు నచ్చిన విధంగా తెరకెక్కించుకున్నాడు. ఫైనల్లీ  సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే కళ్ళు ఆర్పకుండా చూసేస్తారు నందమూరి ఫ్యాన్స్ . అంతలా ఈ సినిమా బాగుంటుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: