
ట్రైలర్: కోర్ట్ సినిమా ట్రైలర్ తో అదరగొట్టేస్తున్న ప్రియదర్శి..హిట్ కొట్టేలా ఉన్నారుగా..?
ట్రైలర్ విషయానికి వస్తే తన కూతురితో ప్రేమలో ఉన్నారని విషయంపై ఒక తండ్రి (శివాజీ) ఆ కుర్రాడు పైన కక్ష ఎలా తీర్చుకున్నారు అనే కదా అంశంతో తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. అమ్మాయిలకు సంబంధించిన అన్ని సెక్షన్స్ మీద కూడా ఆ యువకుడు మీద కేసులు పెట్టినట్టుగా చూపించారు. ఏకంగా ఫోక్సో కేసు పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతారు.. ఆ తర్వాత బెయిల్ రాకపోవడంతో సుమారుగా 78 రోజులపాటు జైల్లోనే ఆ కుర్రాడు మగ్గుతూ ఉంటారు.. ఫోక్సో కేసు వల్ల ఎవరు వాదించడానికి ముందుకు రాకపోవడంతో చివరికి ప్రియదర్శి ఆ కేసును వాధిస్తూ ఉన్నట్టుగా చూపించారు.
మొత్తానికి ట్రైలర్ తోనే మంచి ఇంఫాక్ట్ చూపించిన కోర్ట్ సినిమా ట్రైలర్ వైరల్ గా మారడంతో ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తూ సొసైటీకి ఇలాంటి సినిమాలే ఇప్పుడు చాలా అవసరము ఖచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియదర్శిని చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి పాత్రలు ఎక్కువగా నటిస్తూ ఉన్నారు ప్రియదర్శి. మరి ఏ మేరకు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకొని ప్రశంసలు అందుకుంటుందో చూడాలి మరి.