సంతాన ప్రాప్తిరస్తు ప్రయోగం ఆకట్టుకుంటుందా !
ప్రస్తుతం భారతదేశాన్ని ఒక సామాజిక సమస్య పీడిస్తోంది. ఈసమస్య ఎక్కువగా బాగా చదువుకున్నవారిలో కెరియర్ పట్ల టెన్షన్ ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తోందని సర్వేలు చెపుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో 24 - సంవత్సరాల వయస్సు ఉన్న మగవారిలో సంతానోత్పత్తి వీర్యకణాలు తగ్గిపోతున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. దీనితో ఎలర్ట్ అయిన అనేకమంది రాజకీయ నాయకులు సామాజిక వేత్తలు కూడ పిల్లలను కనండి అంటూ ప్రోత్సాహిస్తున్న నేపధ్యంలో అర్బన్ ప్రాంతాలలో సంతోనోత్పత్తి కేంద్రాల హవా బాగా నడుస్తోంది.
ఈ సున్నితమైన సమస్యను కథగా మార్చి త్వరలో ఒక సినిమా రాబోతోంది. విక్రాంత్ చాందిని చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ ని మధురా శ్రీధర్ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ‘కలర్ ఫోటో’ ‘సమ్మతమే’ సినిమాల తరువాత చాందిని చౌదరి మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఇది.
హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే ఒక యువకుడి ప్రేమ పెళ్లి పట్ల నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉంటాయి. తాను ఇష్టపడిన అమ్మాయిని ఆ అమ్మాయి తండ్రి ఎన్ని అడ్డంకులు సృష్టించినా పెళ్లి చేసుకుంటాడు. అయితే సంతానం కలిగే విషయంలో వీర్య కణాలు తక్కువగా ఉండటం వల్ల హీరోకి చిక్కులు ఎదురవుతాయి. తన భార్యని వంద రోజుల్లో గర్భవతిని చేస్తాను అన్న సవాల్ తో డాక్టర్లు ప్రకృతి వైద్యులను కలుస్తూ తిరుగుతూ ఉండటంతో ఈసినిమాలోని ట్విస్ట్ లు మొదలై పూర్తిగా కామెడీ ట్రాక్ గా మారుతుంది.
వినోదంతో పాటు సందేశం కూడా జోడించి ఈసున్నితమైన కథను దర్శకుడు సంజీవ రెడ్డి డిఫరెంట్ గా తీసినట్లు అనిపిస్తోంది. రచయిత కళ్యాణ్ రాఘవ్ సంభాషణలు చమత్కారంగా ఉండటంతో ఈమూవీ అర్బన్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందా అన్నసందేహాలు వస్తున్నాయి. ఉన్నాయి. మగాడి జీవితంలో సులభమైన సంతాన ప్రక్రియను క్లిష్టంగా మార్చారంటూ వెన్నెల కిషోర్ తో చెప్పిన డైలాగు ద్వారా ఈ సినిమా కథను అందరికీ తెలిసేలా చేశారు..