రెండు వారాల్లో అనౌన్స్మెంట్ అన్నారు .. చిరు , అనిల్ రావిపూడి సినిమాపై కొత్త ట్విస్ట్..?
కథలో కొన్ని కీలకమైన మూడు సీక్వెన్స్ లకు సంబంధించి స్క్రీన్ ప్లే డైలాగ్స్ పై మళ్లీ రచయితల టీం రీ వర్క్ చేస్తున్నరు .. ఒక్కో సీక్వన్స్ కి మూడు నాలుగు వెర్షన్లు రాస్తున్నారు . ప్రస్తుతానికి ఫస్ట్ ఆఫ్ మీద మాత్రమే పనిచేస్తున్నారు . ఇది చిరంజీవి , అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించిన తాజా స్టేటస్ .. ఈ సంవత్సరం మే లేదా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాం అంటూ నిర్మాత కూడా ప్రకటించారు .. కానీ ఆ టైం కు బౌండెడ్ స్కిప్ రెడీ అవుతుందా అనేది మాత్రం అనుమానం . అలాగే ఈ సినిమాకు సంబంధించిన చిరు సహా అందరి టార్గెట్ ఒకటే అదే సంక్రాంతి రిలీజ్ మరి .. ఆ టైం కు అనిల్ చిరంజీవి వస్తారా రారా అనేది కూడా అనుమానమే .