
రష్మికకు బుద్ధి చెబుతాం...కాంగ్రెస్ ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్
ఇటీవలే రష్మిక, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో నటించిన ఛావా సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. ఈ సినిమాతో మరోసారి ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా సినిమాలో రష్మిక, శంభాజీ భార్య ఏసుబాయిగా అద్బుతంగా నటించింది. అయితే కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్ కి రష్మిక మందన్నని కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఆహ్వానించారు. అయినప్పటికీ ఆమె ఆ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్లలేదు. దీంతో వివిధ భాషలలో నటిస్తున్న రష్మిక.. కన్నడను నిర్లక్ష్యం చేస్తుందని కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. అలాగే తాజాగా ఓ ఈవెంట్ లో తాను హైదరాబాద్ వాసినని చెప్పుకోవడంపై కూడా పలు విమర్శలు వచ్చాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పినట్లు సినిమా ఇండస్ట్రీ వాళ్లకి నట్లు, బోల్టులు బిగించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ ఇన్ డైరెక్ట్ గా రష్మికకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
ఇక రష్మిక మందన్న 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ మూవీ ద్వారా నటిగా పరిచయమమైంది. ఈమెను అక్టోబరు 2024లో కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.