తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ గుర్తింపు కలిగిన నటి మనులలో పూజా హెగ్డే ఒకరు. ఈమె నాగ చైతన్య హీరో గా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మకు తెలుగు లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కాయి. దానితో ఈమె చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
ఇకపోతే చాలా కాలం పాటు అద్భుతమైన జోష్ లో తెలుగు సినీ పరిశ్రమలో కెరీర్ను కొనసాగించిన ఈ ముద్దు గుమ్మకు ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఈ మధ్య కాలంలో ఈమె నటించిన తెలుగు సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడం తోనే ఈమెకు చాలా వరకు సినిమా అవకాశాలు తగ్గాయి అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే పోయిన సంవత్సరం ఈ బ్యూటీ నటించిన ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కాలేదు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస పెట్టిన తమిళ్ , హిందీ సినిమాలలో నటిస్తూ వస్తుంది. తాజాగా ఈమె దేవా అనే హిందీ సినిమాలో నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం మాత్రం ఈ బ్యూటీ అనేక తమిళ సినిమాలలో నటిస్తోంది.
ప్రస్తుతం ఈమె తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే సూర్య హీరోగా రూపొందుతున్న రెట్రో తమిళ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే రెండు క్రేజీ తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్న ఈ బ్యూటీ కాంచన 4 అనే తమిళ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈమె వరస పెట్టి తమిళ సినిమాలను ఓకే చేస్తున్నట్టు తెలుస్తుంది.