మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది దేవర సినిమాతో తన కెరీర్ లోనే భారీ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. దేవర సినిమా తరువాత ఎన్టీఆర్ పవర్ఫుల్ లైనప్ తో దూసుకుపోతున్నాడు..దేవర సినిమా తరువాత ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి “వార్ 2” సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ వున్న పాత్రలో కనిపించనున్నాడని సమాచారం..
ఇదిలా ఉంటే వార్ 2 లో ఎన్టీఆర్ పార్ట్ షూటింగ్ ముగిసినట్లు సమాచారం.. వార్ 2 సినిమాను మేకర్స్ ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.వార్ 2 షూటింగ్ ముగియడంతో ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో బిగ్గెస్ట్ మూవీ మొదలు పెట్టాడు..ఇటీవలే గ్రాండ్ గా షూటింగ్ మొదలు పెట్టిన ప్రశాంత్ నీల్ భారీ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ త్వరలోనే జాయిన్ కానున్నాడు..ఎన్టీఆర్ అభిమానులు సైతం ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు..మైత్రి మూవీ మేకర్స్
ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తుంది..ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ క్యూట్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది..
ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటే దేవర పార్ట్ 2 ని కూడా మొదలు పెట్టనున్నారు.జులై నెలలో దేవర 2 సినిమా మొదలెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం.. మొదటి పార్ట్ పై కాస్త నెగటివ్ టాక్ రావడంతో సెకండ్ పార్ట్ కథలో కొరటాల కొన్ని కీలక మార్పులు చేసాడు.. నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టినట్లు సమాచారం.. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి ఫినిష్ చేయాలనీ తారక్ భావిస్తున్నట్లు తెలుస్తుంది..