డ్రాగన్ : "తారక్"ను బీట్ చేసిన నీల్.. మరి అంతా తేడానా..?

frame డ్రాగన్ : "తారక్"ను బీట్ చేసిన నీల్.. మరి అంతా తేడానా..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ మూవీ రూపొందబోతున్నట్లు చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాక ముందే ఈ సినిమాకు మేకర్స్ డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నాట్లు కూడా ఓ వార్త వైరల్ అయింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన చాలా కాలం తర్వాత ఈ మూవీ యొక్క షూటింగ్ తాజాగా ప్రారంభం అయింది.


ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించినట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన తారక్ , ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తారక్ , నీల్ ఇద్దరికీ అద్భుతమైన గుర్తింపు ఇండియా వ్యాప్తంగా ఉండడంతో వీరిద్దరు కూడా డ్రాగన్ మూవీ కోసం అదిరిపోయే రేంజ్ లో పారితోషకాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా పారితోషకం విషయంలో తారక్ ను నీల్ దాటేసినట్లు వార్తలు వస్తున్నాయి.


అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా కోసం తారక్ 120 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు , అలాగే ప్రశాంత్ నీల్ మొత్తంగా కలిపి 200 కోట్ల వరకు ఈ మూవీ కోసం పారితోషకం పుచ్చుకుంటున్నట్లు , దానితో తారక్ కంటే కూడా ప్రశాంత్ ఏకంగా 80 కోట్లు ఎక్కువ పారితోషకాన్ని డ్రాగన్ సినిమా కోసం  అందుకోబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తారక్ "వార్ 2" అనే హిందీ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: