
ఆ క్లాసిక్ దర్శకుడి డైరెక్షన్ లో నవీన్ పోలిశెట్టి క్యూట్ లవ్ స్టోరీ..!!
ప్రస్తుతం కమల్ హాసన్ తో థగ్ లైఫ్ అనే మూవీ రూపొందిస్తున్నాడు మణిరత్నం. వీరి కాంబినేషన్ లో 35యేళ్ల తర్వాత వస్తోన్న సినిమా ఇది. త్రిష, శింబు, అభిరామి, జోజూ జార్జ్, పంకజ్ త్రిపాఠి వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సమ్మర్ లో జూన్ 5న రిలీజ్ కాబోతోంది థగ్ లైఫ్. ఈ మూవీ తర్వాతే నవీన్ పోలిశెట్టితో ఓ న్యూ ఏజ్ లవ్ స్టోరీ రూపొందించేందుకు ప్లానింగ్ చేస్తున్నాడు మణిరత్నం అనే రూమర్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మరి ఇది నిజమా కాదా అనే కన్ఫర్మేషన్ నవీన్ టీమ్ నుంచే రావాలి. బట్.. నవీన్ లాంటి యాక్టర్ తో మణిరత్నం సినిమా అంటే చూసేవారికీ ఐ ఫీస్ట్ లా ఉంటుందేమో కదా.ఇదిలా ఉండగా ఇటీవలే లెజెండరీ దర్శకులు మణిరత్నం మన నవీన్ పోలిశెట్టికి ఒక లైన్ చెప్పారని ఫిలిం నగర్ టాక్. పొన్నియిన్ సెల్వన్, తగ్ లైఫ్ లాంటి భారీ ప్యాన్ ఇండియా మూవీస్ తర్వాత ఒక కూల్ రొమాంటిక్ లవ్ స్టోరీ చేసే ఆలోచనలో మణిరత్నం ఉన్నారు. సఖి, మౌనరాగం, ఓకే బంగారం టైపు లో తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేసుకున్నారు. ముందు కొత్త నటీనటులతో తీస్తారని టాక్ వచ్చింది కానీ తర్వాత మనసు మార్చుకుని స్టార్ క్యాస్టింగ్ వైపే మొగ్గు చూపారట. అందులో భాగంగానే నవీన్ పోలిశెట్టిని సంప్రదించారని అంటున్నారు.