ఒక సినిమా పూర్తి అయిన తర్వాత విడుదల కావడానికి మధ్యలో సెన్సార్ కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. సెన్సార్ బోర్డు వారు సినిమా మొత్తాన్ని చూసి సినిమాలో ఏదైనా అశ్లీలత కంటెంట్ ఉందా , రక్తపాతం ఉందా , ఏదైనా దేశానికి ప్రమాదం కలిగించే సన్నివేశాలు ఉన్నాయా అనే దాన్ని పరిశీలిస్తారు. అలా పరిశీలించిన తర్వాత దేశానికి కానీ , ప్రజలకు కానీ ఖచ్చితంగా ఆ సన్నివేశాల ద్వారా బాధ కలుగుతుంది అనుకుంటే వెంటనే వాటిని తీసేస్తూ ఉంటారు.
ఇక శ్రుతి మించిన శృంగారం , రక్త పాతం సన్నివేశాలు ఉన్నా వాటిని తొలగిస్తారు. ఇక ఆ సినిమాలో ఉన్న కంటెంట్ బట్టి దానికి సర్టిఫికెట్ ను జారీ చేస్తూ ఉంటారు. సినిమాలో శృంగారం , రక్త పాతం , హార్రర్ సన్నివేశాలు మితి మీరి ఉన్నట్లయితే వాటికి "ఏ" సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఇక రక్తపాతం , శృంగారం కాస్త పరవాలేదు అనే స్థాయిలో ఉంటే అలాంటి మూవీలకి యు / ఏ సర్టిఫికెట్ ను ఇస్తారు. ఇక ఒక సినిమా కుటుంబం మొత్తం చూసే విధంగా ఉన్నట్లయితే దానికి క్లీన్ "యు_ సర్టిఫికెట్ ను ఇస్తారు. ఇలా సినిమాకు వచ్చిన సర్టిఫికెట్ను బట్టి జనాలు ఆ సినిమాను చూడాలా ... చూడకూడదా అనేది డిసైడ్ చేసుకుంటారు. ఇక ఓ టి టి కంటెంట్ విషయంలో ఇలాంటి ప్రాసెస్ ఏమి ఉండదు. ఎంత శృంగారం ఉన్నా యాక్షన్ ఉన్న హార్రర్ ఉన్న దానికి ఎలాంటి సర్టిఫికెట్ ఉండదు. దానితో కొంత మంది సినిమాలను చూడడం మొదలు పెట్టాక వారికి నచ్చని సన్నివేశాలు వచ్చినట్లయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఓ టి టి లోకి వచ్చే కంటెంట్లో మితిమీరిన శృంగారం , హార్రర్ , రక్తపాతం , ఆశ్లీల సంభాషణలు ఉండడం సర్వసాధారణంగా గమనిస్తున్నాం.
ఇక ఇలాంటి వాటిని అడ్డుకోవడం కోసం తాజాగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ ఓ టి టి సంస్థలకు ఆదేశాలను ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ సంస్థ వారు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ వారు మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోండి. మితి మీరిన రక్తపాతం , శృంగారం , జనాలను ఇబ్బంది పెట్టే మాటలను వచ్చే కంటెంట్ ను లేకుండా చూసుకోండి అని ఓ లేఖను విడుదల చేసింది.