
ఎన్టీఆర్ పాటను ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ.. క్యూట్ వీడియో వైరల్..!
దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ పాత్రలో కనిపించడం జరిగింది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు కొరటాల శివ. ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుద్ అందించగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. సంగీతం వల్లే ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు. ఇందులో చుట్ట మల్లే సాంగ్ కూడా ఒక సెన్సేషనల్ క్రియేట్ అయ్యిందని కూడా చెప్పవచ్చు. ఈ సాంగ్ కి అక్కడక్కడ పలు రకాల హిల్స్ కూడా ఇప్పటికీ వైరల్ గా మారుతూనే ఉన్నాయి.
అయితే ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ నయనతార పిల్లలతో కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నటువంటి కారులో దేవర సినిమాలోని సాంగ్ ని ప్లే చేస్తూ డాన్స్ వేస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. నయనతార భర్త విగ్నేష్ శివన్ కూడా తన పిల్లలతో కలిసి డాన్స్ వేస్తూ కొంతమేరకు మూమెంట్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. అలా దేవర సినిమాలోని సాంగ్ కి బాగా కనెక్ట్ అవుతూ కార్ లోనే వెళ్తూ ఉన్నారు. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తారక్ అభిమానులు కూడా ఈ విషయం పైన క్రేజీగానే కామెంట్ చేస్తూ ఉన్నారు.