రౌడీ బాయ్, నిఖిల్ కాంబోలో బాలీవుడ్ సినిమా?

frame రౌడీ బాయ్, నిఖిల్ కాంబోలో బాలీవుడ్ సినిమా?

MADDIBOINA AJAY KUMAR
రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ కింగ్ డమ్ అని మూవీ మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌ అని తెలిసిందే. ఈ సినిమాను నాగవంశీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో విజయ్ కి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వగా.. తమిళం లో సూర్య, హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు స్టార్ హీరోలు వాయిస్ ఇవ్వడంతో ప్రేక్షకులలో అంచనాలు మరింత పెరిగాయి.  
ఇక ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల అయ్యిందో.. లేదో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో ఈ మూవీ టీజర్ కు 10 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అలాగే డైలాగ్స్ ఉంటాయని మూవీ మేకర్స్ తెలిపారు. ఇక టీజర్ చూడగానే విజయ్ అభిమానులు బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా వేసవి సెలవులలో మే 30న రిలీజ్ అవ్వనుంది.  
ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యాన్‌ దర్శకత్వంలో ఒక సినిమా, రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో మరో సినిమాతో రెడీగా ఉన్నాడు. ఇక ఇటు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటుగా అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ రౌడీ బాయ్ ఒక సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కిల్ సినిమా దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వంలో విజయ్ సినిమా చేయబోతున్నాడు అంట. అయితే ఈ మూవీని బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు అంట. ఈ సినిమా ఒప్పందం లైగర్ సినిమా సమయంలోనే జరిగిందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: