8 ఏళ్ల ఘాజీ : టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్ ఇదే.. ఎన్ని కోట్ల లాభాలను అందుకుందో తెలుసా..?

frame 8 ఏళ్ల ఘాజీ : టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్ ఇదే.. ఎన్ని కోట్ల లాభాలను అందుకుందో తెలుసా..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు దగ్గుపాటి రానా హీరోగా తాప్సి హీరోయిన్గా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం ఘాజీ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా 2017 వ సంవత్సరం ఫిబ్రవరి 17 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సినిమా విడుదల అయ్యి 8 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ మూవీ కి ఆ సమయంలో వచ్చిన కలెక్షన్స్ , వచ్చిన లాభాల వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 4.30 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 85 లక్షలు , ఉత్తరాంధ్ర లో 1.52 కోట్లు , ఈస్ట్ లో 64 లక్షలు , వేస్టు లో 45 లక్షలు , గుంటూరులో 71 లక్షలు , కృష్ణ లో 86 లక్షలు , నెల్లూరు లో 25 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 9.58 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా లో 14 కోట్లు , ఓవర్సీస్ లో 2.50 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 26.08 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ ఫుల్ రన్ లో 26.08 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. దానితో ఈ మూవీ ద్వారా బయ్యర్లకు 8.8 కోట్ల లాభాలు దక్కాయి. దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: