
అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్లో మంచు మనోజ్... ఆగ్రహం.. !
తాను రిసార్ట్లో ఉంటే సైరన్ ఎందుకు ? వేస్తారని తన ప్రవేశ ఎందుకు డిస్టర్బ్ చేస్తారని ఎస్సైని నటుడు మనోజ్ ప్రశ్నించారు. అనంతరం రిసార్ట్స్ నుంచి మనోజ్‌ను బాకారావుపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. పిఎస్ కు చేరుకున్న తర్వాత ఆయన సీఐ ఇమ్రాన్ భాషతో ఫోన్లో వాదనకు దిగారు. సీఎం పేరుతో తనతో పాటు తన అనుచరులను బెదిరిస్తున్నారని .. ఇది సరికాదన్నారు. సీఎం స్థాయి వ్యక్తీ ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పట్టించుకుంటారని సిఐ ని మంచు మనోజ్ ప్రశ్నించారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయం వద్ద ఉన్న షాపులను ధ్వంసం చేస్తే మాత్రం పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. అర్ధరాత్రి తర్వాత కూడా పోలీస్ స్టేషన్లు బైఠాయించిన మనోజ్ తనను ఎందుకు వెంటపడుతున్నారు పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు మంచి మనోజ్ లాయర్ బాకారావుపేట పోలీస్ స్టేషన్కు వెళ్లి సిఐ - ఎస్ఐ తో మాట్లాడినట్టు తెలుస్తోంది. తన ప్రైవసీ కి భంగం కలిగించమని హామీ ఇస్తేనే వెళతానని మనోజ్ చెప్పారు. చివరకు అర్ధరాత్రి ఒంటి గంటకు పోలీస్ స్టేషన్ నుంచి మనోజ్ వెళ్లిపోయారు.