
ఎస్ కే ఎన్ ఇంతమంది తెలుగమ్మాయిలను హీరోయిన్లను చేశాడా? మరి అలా ఎందుకన్నాడు?
అయితే ఆ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య అని అందరికీ అర్ధం అయ్యింది. అయితే డ్రాగన్ సినిమాలో నటించడానికి వైష్ణవి చైతన్య ఒప్పుకోలేదని తెలుస్తోంది. తనకి మళ్లీ వీరి బ్యానర్ లో మళ్లీ నటించేందుకు వైష్ణవి డేట్స్ ఇవ్వలేదని సమాచారం. ఈ సినిమాను కాదని సితార సినిమాని చేస్తుందని చర్చలు జరుగుతున్నాయి. అలా వైష్ణవి చైతన్య వీరికి నో చెప్పడంతో నిర్మాత, సాయి రాజేష్ హార్ట్ అయ్యి ఇలా మాట్లాడారని టాక్ వినిపిస్తుంది.
ఇక నిర్మాత ఎస్ కే ఎన్ చాలా మంది తెలుగు అమ్మాయిలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇటీవల రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బేబీ మూవీతో వైష్ణవి చైతన్యని పరిచయం చేశాడు. టాక్సీవాలా సినిమాతో ప్రియాంక జవాల్కర్ ని, ఆనందం సినిమాలో రేష్మని, రొమాన్స్ మూవీలో మానసని, అలాగే 3 రోజెస్ సినిమాతో కుషి ని పరిచయం చేశారు. ఇలా ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీలోకి రావడానికి తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇచ్చారు.