హరిహర వీరమల్లుకు అసలు సమస్య ఇదేనా.. ఆ తేదీన రిలీజ్ కావడం డౌటేనా?

Reddy P Rajasekhar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు మొదలయ్యే సమయానికి రిలీజయ్యే సమయానికి అస్సలు పొంతన ఉండటం లేదు. వేర్వేరు కారణాల వల్ల పవన్ కళ్యాణ్ సినిమాలు వాయిదా పడుతున్నాయి. హరిహర వీరమల్లు సినిమా మొదలై నాలుగు సంవత్సరాలు అవుతుండగా ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేదు. మార్చి 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ఆ సమయానికి విడుదలవుతుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.
 
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ మళ్లీ వాయిదా పడటం పక్కా అని తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు హరిహర వీరమల్లు మూవీ వాయిదా పడటానికి కారణమని సమాచారం అందుతోంది. నిధి అగర్వాల్ కెరీర్ సైతం ఈ సినిమాపై ఆధారపడిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు ఎన్నికల్లో గెలిచిన తర్వాత షూట్ లో పాల్గొనడానికి అనుకూలంగా పరిస్థితులు అయితే లేవని చెప్పవచ్చు.
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో షూట్ లో పాల్గొంటే విమర్శలు వస్తాయని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ పారితోషికం కూడా ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.
 
పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన సినిమాలను సైతం వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తే మరిన్ని సంచలనాలు సృష్టించడం పక్కా అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా ఎలా ముందుకెళ్తారో చూడాలి. పవన్ కొడుకు సినీ ఎంట్రీ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: