
సంక్రాంతికి వస్తున్నాం.. ఓటీటీ రైట్స్ తో లాభమెంత?
కాగా, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా....మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ద్వారా నిర్మాత దిల్ రాజు భారీగా లాభాలను పొందిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా విడుదలై దాదాపు నెల రోజులకు పైనే అయింది. దీంతో ఈ సినిమా ఓటీటీ హక్కులను zee5 సంస్థ కొనుగోలు చేసింది.
అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీ హక్కులను 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని సమాచారం అందుతుంది. అయితే ఓటీటీలో రిలీజ్ కు ముందు ఈ సినిమాను టీవీలలో రిలీజ్ చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నారట. ఇప్పటికీ ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఖరారు కాలేదు. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న సినిమాలు ఓటిటీలో భారీగా వ్యూస్ సాధిస్తాయి.
కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ముందుగా టీవీలలో ప్రసారం చేయాలని అనుకుంటున్న సందర్భంగా ఈ సినిమా డిజిటల్ రన్ ఎలా ఉంటుందోనని సందేహంలో ఉన్నారట. అటు ఈ సినిమా కారణంగా నిర్మాత దిల్ రాజు దాదాపు 100 కోట్లకు పైగా ప్రాఫిట్ కలెక్షన్లు వచ్చాయి. అంతేకాకుండా గేమ్ చేంజర్ సినిమాకు కూడా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. కానీ ఈ సినిమా వల్ల దిల్ రాజు భారీగా నష్టాలను ఎదురు చవిచూడాల్సి వచ్చింది. ఆ నష్టాలను గేమ్ చేంజర్ సినిమాతో దిల్ రాజు బ్యాలెన్స్ చేసుకున్నారు. మరి ఈ సినిమా ఓటిటిలో ఎప్పుడు ప్రసారమవుతుందో చూడాలి.