మళ్లీ ప్రేమలో పడ్డ సమంత.. పోస్ట్ వైరల్..!

frame మళ్లీ ప్రేమలో పడ్డ సమంత.. పోస్ట్ వైరల్..!

Divya
టాలీవుడ్ హీరోయిన్ సమంత మొదటిసారి ఏమాయ చేసావే అనే సినిమాతో తెలుగు తెరకు సుపరిచితమయ్యింది.. ఈ సినిమాతో ఒక్కసారిగా సమంత కెరీరే మలుపు తిరిగింది. ఆ తర్వాత తమిళ్ టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోల చిత్రాలలో నటించిన సమంత అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా క్రేజీ సంపాదించి బారి అభిమానులను సంపాదించింది. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సమంత ,నాగచైతన్య వివాహం చేసుకోగా కొన్నేళ్లపాటు వీరి కాపురం చాలా సజావుగానే సాగింది.. వీరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.


ఆ తర్వాత సమంత పలు చిత్రాలలో నటించి మెప్పించింది.. సమంతకు మయోసైటిస్  కారణంగా గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ.. ఒకవైపు ఆరోగ్యం మరొకవైపు సినిమాలలో కనిపిస్తూ ఉన్నది. అప్పుడప్పుడు పలు రకాల ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతూ తన జీవితంలో జరిగిన సంఘటనలను తెలియజేస్తూ ఉంటుంది. సమంత గురించి గత కొద్దిరోజులుగా కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సమంత ఎవరినో ప్రేమిస్తోందని త్వరలోనే మరొక వివాహం చేసుకోబోతోందనే విధంగా వార్తలు వినిపించాయి.

నిన్నటి రోజున వాలెంటైన్స్ డే సందర్భంగా సమంత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలను కూడా తెలియజేయడం జరిగింది. ఇందులో షర్టు పై రెడ్ హార్ట్ సింబల్ కూడా ఉండడం గమనార్హం. ఇవి చూసిన నెటజన్స్ సైతం సమంత మళ్ళీ ప్రేమలో పడిందనీ.. అందుకే ఈ హింట్ ఇచ్చిందని.. అంతేకాకుండా సమంత ఎవరితోనో డ్రింక్ తాగుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి ఫోటోలు అన్నీ కూడా సమంత లవ్ లో ఉందనే వాటికి బీజం వేసేలా కనిపిస్తున్నాయని కొంతమంది నెటిజన్స్ తెలుపగా.. అయితే ఈ విషయాలను అభిమానులు మాత్రం కొట్టి పారేస్తూ ఉన్నారు.. మరి సమంత షేర్ చేసిన ఈ ఫోటోలకు ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: