
ప్రభాస్ కు ఆ హీరోయిన్ తో పెళ్లి జరిగితే బాగుండేదా.. ఇలా అయిందంటి గురు..!
ఇక ఈ సినిమాతో పాటుగా సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు .. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతుందని సందీప్ క్లారిటీ ఇచ్చాడు . ఇక ప్రభాస్ తన సినీ కెరియర్ మొదట్లో త్రిష తో మూడు సినిమాలు చేశాడు .. ఇక ఆ మూడు సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడమే కాకుండా వీరిద్దరి కాంబినేషన్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి . ఇక అదే సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చాయి . కానీ అదంతా ఫేక్ వార్తలుగా మిగిలిపోయాయి .. ఇక ఇప్పుడు ప్రభాస్ అభిమానులు మాత్రం అప్పటిలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకున్న బాగుండేది అలా అయితే ప్రభాస్ అప్పుడే ఓ ఇంటివాడు అయి ఉండేవాడని అంటున్నారు.
ఇక ప్రస్తుతం ప్రభాస్ సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ సింగిల్గానే ఉంటున్నాడు .. ప్రభాస్ తోటి హీరోలైన మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ వంటి వారి కొడుకులు కూడా ఇప్పుడు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్ మాత్రం 50 సంవత్సరాలకు దగ్గరవుతున్న కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడంతో ఆయన తర్వాత ఇండస్ట్రీలో వారసుడు ఎవరు వస్తారు తమ స్టార్ డంను ఎవరు ముందుకు తీసుకువెళ్తారు అంటూ అభిమానులు కొంత నిరాశ పడుతున్నారు. కృష్ణంరాజు తర్వాత రెబల్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత ఇండియాలోనే నెంబర్ వన్ హీరో పొజిషన్కు వెళ్లులాడు .. ఇలాంటి సమయంలో వీళ్ళ ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ జనరేషన్ హీరోగా ఎవరు వస్తున్నారనే ప్రశ్నకి మాత్రం ఎలాంటి సమాధానం దొరకట్లేదు . ఇక మరి రాబోయే రోజులైనా ప్రభాస్ పెళ్లి చేసుకుని ఈ అభిమానుల కల నెరవేరుస్తారో లేదా అనేది చూడాలి.