
కెరియర్ లోనే ఫర్ ద ఫస్ట్ టైం బాలయ్య మల్టీస్టారర్ మూవీ..హీరో ఎవరంటే..?
ఈ సినిమాతో ఆయన లెవెల్ మరింత స్థాయిలో పెరిగిపోయింది . గేమ్ చేంజర్ సినిమాకి కాంపిటీటివ్గా వచ్చిన "డాకు మహారాజ్" అద్దిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. గేమ్ చేంజర్ అట్టర్ ఫ్లాప్ అవ్వగా "డాకు మహారాజ్" సూపర్ డూపర్ హిట్ అయింది . మరీ ముఖ్యంగా తమన్ మ్యూజిక్ .. బాలయ్య నటన .. బాలయ్య వైల్డ్ పర్ఫామెన్స్ .. అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి అంటూ నందమూరి అభిమానులు కామెంట్స్ చేశారు . ప్రజెంట్ అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు బాలయ్య . అయితే బాలయ్య కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. బాలయ్య ఓ మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .
బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 కంప్లీట్ అయిన తర్వాత మళ్లీ గోపీచంద్ మల్లినేని కి అవకాశం ఇచ్చాడు బాలయ్య అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు "క్రాక్" లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మల్లినేనితో రవితేజ మరొకసారి మూవీకి ఫిక్స్ అయ్యాడు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . కాగా గోపీచంద్ మల్లినేని ఒక బిగ్ మల్టీస్టారర్ మూవీ కథను రాసుకున్నారు అని .. ఆ కథని బాలయ్య రవితేజలతో తెరకెక్కించబోతున్నారు అని.. కచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని.. మరీ ముఖ్యంగా అన్నదమ్ముల సెంటిమెంట్ బేస్ చేసుకుని ఈ కథను చాలా సెంటిమెంటల్ గా రాశాడు గోపీచంద్ మల్లినేని అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం బాలయ్య కెరియర్లో మరొక బిగ్ బ్లాక్ బస్టర్ పడ్డట్లే అని చెప్పుకోవాలి . బాలయ్య - రవితేజ కాంబో సెట్ అయితే మాత్రం రచ్చ రంబోలానే . మరొక చరిత్ర సృష్టించినట్లే . ఇది నిజంగా సెన్సేషనల్ కాంబో అంటున్నారు జనాలు . చూద్దాం మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..??