తమిళ నటుడు అజిత్ కుమార్ తాజాగా విడ ముయార్చి అనే తమిళ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఫిబ్రవరి 6 వ తేదీన విడుదల చేశారు. ఇకపోతే ఫిబ్రవరి 6 వ తేదీన ఈ మూవీని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేశారు. తెలుగు లో ఈ సినిమాను పట్టుదల అనే పేరుతో విడుదల చేశారు. త్రిష ఈ మూవీ లో అజిత్ కి జోడిగా నటించింది. ఇకపోతే ఈ సినిమాను భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 6 వ తేదీన విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు భారీ ఎత్తున కలెక్షన్లు దక్కలేదు. మరి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.
మొదటి రోజు ఈ మూవీ కి తమిళ నాడు ఏరియాలో 26.15 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి మొదటి రోజు కేవలం 65 లక్షల కలెక్షన్లు మాత్రమే దక్కాయి. ఇక కర్ణాటక ఏరియాలో ఈ మూవీ కి మొదటి రోజు 4.35 కోట్ల కలెక్షన్లు దక్కగా , కేరళ ప్రాంతంలో 1.35 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ కి మొదటి రోజు కేవలం 50 లక్షల కలెక్షన్లు మాత్రమే దక్కాయి. మొదటి రోజు ఈ మూవీ కి ఓవర్సీస్ లో 15.45 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే మొత్తంగా ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 23.80 కోట్ల షేర్ ... 48.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ సినిమా మరో 68.20 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తోంది.