ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న 6 సినిమాలు ఇవే

frame ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న 6 సినిమాలు ఇవే

MADDIBOINA AJAY KUMAR
ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే సంక్రాంతి కానుకగా పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పటికే మెగా హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అయ్యింది. అలాగే ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఇక అలా రిలీజ్ అవుతాయో లేదో.. ఇలా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇక ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే పండగ అనే చెప్పాల్సిందే. ఈ వారం ఎన్ని కొత్త సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా.. ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లో గేమ్ ఛేంజర్ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సినిమాకు డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. అలాగే నెట్ ఫ్లిక్స్ లో దేవకీ నందన వాసుదేవ సినిమా కూడా ఈ నెల 8న స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో అశోక్ గల్లా, మానస ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహించాడు.
జీ5 ఓటీటీలో కిచ్చా సుదీప్ నటించిన మ్యాక్స్ సినిమా ఈ నెల 22న స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ లో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సునీల్‌ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.  ఇక నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కధలిక్క నేరమిల్లై మూవీ కూడా ఫిబ్రవరి 11న రిలీజ్ అవ్వనుంది. ఇది తమిళ భాషాలో తీసిన రొమాంటిక్ కామెడీ సినిమా. ఈ సినిమాకు కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై నిర్మించారు.  అలాగే సోనీ లైవ్ లో మార్కో సినిమా ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్ అవ్వనుంది. ముఫాసా - ది లయన్ కింగ్ సినిమా కూడా హాట్ స్టార్ లో రిలీజ్ అవ్వనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: