సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల కళా ప్రపంచం. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే కేవలం నటన టాలెంట్ ఉంటే సరిపోదు. ఎలాంటి పరిస్థితినైనా అనుభవించే శక్తి ఉండాలి. ముఖ్యంగా సినీ కళా ప్రపంచంలో మహిళలు రాణించాలి అంటే కత్తి మీద సాము లాంటిదే.. అలా ఏ ఇండస్ట్రీలో అయినా హీరోయిన్స్ అంటే చాలా చులకనగా చూస్తూ ఉంటారు. అలా చులకన భావాన్ని ఎదుర్కొని ఎన్నో అవమానాలు అనుభవించి చివరికి హీరోలకే పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిన హీరోయిన్లలో ప్రియాంక చోప్రా ఒకరు.. ఈమె ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరికి స్టార్ హీరోయిన్ గా మారింది. అలాంటి ప్రియాంక చోప్రాను ఒక డైరెక్టర్ దారుణంగా అవమానించారని, చివరికి తన ప్రైవేట్ పార్ట్స్ లో దుస్తులు కనిపించేలా యాక్టింగ్ చేయాలంటూ ఇబ్బంది పెట్టారట. మరి ఆయన ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ప్రియాంక చోప్రా 2003 లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.అలా తన నటనా టాలెంట్ ను చూపించుకొని ఒక్కో మెట్టెక్కుతూ ఇండస్ట్రీలోనే స్టార్ గా మారింది..
అలాంటి ప్రియాంక చోప్రా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో ధైర్యంగా చెప్పింది. తాను 19 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో ఒక డైరెక్టర్ తన విషయంలో చాలా చీప్ గా ఆలోచించారని, ఆయన చేసిన పనికి నేను డిప్రెషన్ లోకి వెళ్లానని చెప్పుకొచ్చింది..ఫోబ్స్ పవర్ ఉమెన్ సమ్మిట్ లో ప్రియాంక చోప్రా పాల్గొని తన కెరియర్ ప్రారంభంలో ఎదురైన అవమానాల గురించి చెప్పుకొచ్చింది. 19 సంవత్సరాల వయసులోనే నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని, అప్పటికి ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదని అన్నది. ఇదే సమయంలో ఇండస్ట్రీలోని ఒక డైరెక్టర్ ను కలిసి నేను షూటింగ్ కి రావాలంటే ఎలాంటి దుస్తులు వేసుకోవాలి. నేను దుస్తులు ధరించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడిగాను. వెంటనే ఆ డైరెక్టర్ నా స్టైలిస్ట్ కు ఫోన్ చేసి చాలా నీచంగా మాట్లాడారు. ఆ అమ్మాయి వేసుకునే లో దుస్తులన్నీ బయటికి కనిపించాలని అన్నారు.
ఆమె వేసుకునే దుస్తులు అన్ని చాలా చిన్నగా ఉండాలని, ప్రైవేట్ పార్ట్స్ బయటకు కనిపించేలా లోదుస్తులు వేసుకోవాలని తెలియజేశారు.. అంతేకాదు తను కూర్చుంటే లోపల వేసుకునే లోదుస్తులు అన్ని బయటకి కనిపించేలా ఉంటేనే థియేటర్లలోకి ప్రేక్షకులు వస్తారని నా స్టైలిస్ట్ కు చెప్పారు. నువ్వు అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనతో హిందీలో చెప్పడంతో ఆ విషయాలు విన్న నాకు చాలా బాధనిపించింది. ఇవన్నీ అర్థం చేసుకున్న నేను ఆ మరుసటి రోజు వెళ్లి నీతో సినిమా చేయలేదని దర్శకుడు కి డైరెక్ట్ గా చెప్పేసాను.. అప్పటినుంచి ఇండస్ట్రీలో అమ్మాయిలను ఏ విధంగా చూస్తారో అర్థం అయిపోయింది.. అలాంటి నీచమైన డైరెక్టర్ల ముందే బాగా ఎదగాలని అనుకొని, నా నటన టాలెంట్ ను నమ్ముకుని ఈ స్థాయికి వచ్చానని ప్రియాంక చెప్పింది.