
' అతడు ' 50 డేస్ సెంటర్స్ సరికొత్త రికార్డు... డబుల్ సెంచరీ కొట్టిపడేశాడు..!
మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - మహేష్ బాబు కాంబినేషన్లో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. అతడు - ఖలేజా గత ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్ వచ్చిన తొలి సినిమా అతడు. శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సీనియర్ హీరో మురళీమోహన్ ఈ సినిమాను నిర్మించారు. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు సంచలన విజయం సాధించింది. ఇంకా చెప్పాలి అంటే వెండితెర కంటే బుల్లితెర మీద ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పటికే అతడు సినిమా టీవీలలో వస్తుంటే ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా బుల్లి తెరపై టీవీ లలో ఎన్ని సార్లు వచ్చినా.. ఇన్నేళ్ల తర్వాత కూడా అదిరిపోయే టీఆర్పీ రేటింగులు వస్తుంటాయి. మహేష్ బాబు కెరీర్ లో తొలిసారి రెండు వందల పైచిలుకు కేంద్రాలలో 50 రోజులు ఆడిన సినిమాగా అతడు రికార్డుల్లోకి ఎక్కింది.
అంతకుముందు తరుణ్ శ్రేయ హీరోగా నువ్వే నువ్వే సినిమా తెరకెక్కించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన రెండో సినిమాతోనే ఏకంగా మహేష్ బాబును డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా త్రిష హీరోయిన్ గా నటించింది. మణిశర్మ స్వరాలు అందించారు. ఈ సినిమాలో పాటలతో పాటు మహేష్ బాబు - త్రిష మధ్య చిలిపి సన్నివేశాలు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే .. త్రివిక్రమ్ పదునైన సంభాషణలు ... బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాను సూపర్ హిట్ చేశాయి. ఓవరాల్ గా అతడు సినిమా 204 కేంద్రాలలో 50 రోజుల పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఈ సినిమాలో ఉన్న కంటిన్యూ తో పోల్చుకుంటే సినిమా ఇంకా ఎక్కువ వసూలు రాబట్టాల్సి ఉన్న ఎందుకో ఆ స్థాయిలో వసూలు రాలేదని అంటారు. అలాగే కమర్షియల్ గా ఈ సినిమాకు ఎక్కువ బడ్జెట్ పెట్టారు. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కు వచ్చిన వసూళ్లకు కాస్త తక్కువే అన్న చర్చ కూడా అప్పట్లో ఉంది.