తండేల్ నో సేల్‌.. ఓన్ రిలీజ్ వెన‌క మాస్ట‌ర్ ప్లాన్ ఇదే.. !

frame తండేల్ నో సేల్‌.. ఓన్ రిలీజ్ వెన‌క మాస్ట‌ర్ ప్లాన్ ఇదే.. !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి - చందు మొండేటి - బన్నీ వాసు కాంబినేషన్లో తెర‌కెక్కిన సినిమా తండేల్‌. గీతా సంస్థ భారీ నిర్మాణం భారీ అంచనాలు భారీ బడ్జెట్ ఇలా ఎన్నో భారీగా అంచనాలతో ఈ సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఇలాంటి టైం లో నిర్మాత అల్లు అరవింద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా మొత్తాన్ని సొంతంగా కేవలం అడ్వాన్సుల మీద విడుదల చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. నిజానికి గీతా సంస్థ సినిమాలను చాలా వరకు సొంతంగానే విడుదల చేసుకుంటుంది. కొన్ని ఏరియాలను మాత్రమే అమ్ముతుంది. వైజాగ్ లాంటి ఏరియాలను దిల్ రాజు లాంటి వాళ్లకు అమ్మటం మామూలుగా జరుగుతుంది. కానీ తండేల్ సినిమా ను మాత్రం తెలుగు రాష్ట్రాలలో ఈసారి ఎక్కడ అమ్మటం లేదు పూర్తిగా అడ్వాన్సుల మీదనే విడుదల చేస్తున్నారు.


సినిమా ఫైనల్ కాపీ చూసిన తర్వాత నేను నిర్మాత అల్లు అరవింద్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దిల్ రాజుకు కూడా తమ నిర్ణయాన్ని చెప్పారట. తండేల్‌ సినిమాకు థియేటర్ మీద చాలా రావాల్సి ఉంది .. ఎలా లేదన్న కనీసం 35 నుంచి 40 కోట్లు షేర్ థియేటర్ ల నుంచి రావాలి. కానీ నాగచైతన్య మీద అంతంత మొత్తాలు బెట్టు పెట్టాలి అంటే ఎవరు ముందుకు రాకపోవచ్చు. అందువల్లే అలా లెక్కలు పెట్టుకునే బదులు అడ్వాన్సులు అయితే అల్లు అరవింద్ మీద ఉన్న నమ్మకంతో ఎంతైనా ఇస్తారు. లాభం నష్టం ఏదైనా అల్లు అరవింద్ కే ఉంటాయి. నామినల్ కమీషన్ తో సినిమా పంపిన మొత్తం జరుగుతుంది. ఇక సినిమా మీద నమ్మకం లేకపోతే ఎన్ఆర్ఎ కింద అమ్మేయాలి నమ్మకం ఉంది కనుక అడ్వాన్స్ మీద విడుదల చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: