ఠాగూర్ మూవీ 50 రోజుల సెంటర్ల లెక్క తెలుసా.. చిరంజీవి కెరీర్ లో సంచలనం!
196 సెంటర్లలో ఈ సినిమా 100 రోజుల పాటు ప్రదర్శించబడింది. తమిళ మూవీ రమణకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యాన్స్ కు సైతం అంచనాలకు మించి నచ్చింది. ఈ సినిమాలో ఉన్న ఆసక్తికర ట్విస్టులు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఠాగూర్ క్రియేట్ చేసిన రికార్డులను తర్వాత రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి మూవీ బ్రేక్ చేయడం గమనార్హం.
చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నా అభిమానులు సైతం ప్రత్యేకంగా ఠాగూర్ సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఠాగూర్ సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు దర్శకుడు వినాయక్ అద్భుతంగా తెరకెక్కించారు. ఠాగూర్ సినిమా సాధించిన రికార్డులు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రత్యేక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాయని చెప్పవచ్చు.
జ్యోతిక, శ్రియ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా వాళ్లు తమ అద్భుతమైన నటనతో మెప్పించారు. ఠాగూర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కితే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఠాగూర్ సినిమాకు సీక్వెల్ సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని అభిమానులు ఫీలవుతున్నారు. ఠాగూర్ సినిమాలో డాక్టర్లను కించపరిచేలా ఉన్న కొన్ని సన్నివేశాలు సమాజంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తున్నాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.