![అన్నీ కలిసి వస్తే ఇండస్ట్రీలో నెక్స్ట్ పెళ్లి చేసుకోబోయేది ఆ హీరోయినే.. ఫ్యాన్స్ వెయిటింగ్..!](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/movies/movies_latestnews/heroine593b074f-5be0-4f8c-b816-48a0fcd22606-415x250.jpg)
అన్నీ కలిసి వస్తే ఇండస్ట్రీలో నెక్స్ట్ పెళ్లి చేసుకోబోయేది ఆ హీరోయినే.. ఫ్యాన్స్ వెయిటింగ్..!
కాగా ఇలాంటి క్రమంలోనే నెక్స్ట్ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ ఎవరు అనే విషయం బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఇప్పటివరకు కమిటెడ్ అయినా హీరోయిన్స్ లలో ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంది తమన్నా అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. తమన్న కి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఎవరు అనేది కూడా అందరికి తెలుసు. బాలీవుడ్ నటుడు విజయవర్మ . వీళ్ల ప్రేమ-డేటింగ్ ఇంట్లో వాళ్లకి కూడా తెలుసు.వీళ్లకి సంబంధించిన పిక్స్ ఎలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి అనేది కూడా అందరికి తెలుసు.
అంతా కలిసి వస్తే ఆమె ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలు ఎక్కేస్తుంది. పైగా తమన్నా ఖాతాలో చెప్పుకోతగ్గ సినిమాలు లేవు . ఆమె ఫ్యాన్ బేస్ కూడా మెల్లమెల్లగా పడిపోతుంది. ఈ క్రమంలోనే అటు ఫ్యామిలీ పరంగా ఇటు ఫ్యాన్ బేస్ పరంగా చూస్తే తమ్మన్నానే నెక్స్ట్ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. చూద్దాం మరి తమన్నా గుడ్ న్యూస్ ఎప్పుడు వినిపిస్తుందో..? ఫాన్స్ ఆ మూమెంట్ కోసం బాగా వెయిట్ చేస్తున్నారు..!