సినిమాలకు ఫ్యామిలీతో నో ఎంట్రీ.. హైకోర్టు సంచలన తీర్పు..!

frame సినిమాలకు ఫ్యామిలీతో నో ఎంట్రీ.. హైకోర్టు సంచలన తీర్పు..!

Divya
చాలామంది అభిమాన హీరోలకు చిన్న పిల్లలు కూడా ఉంటారు. ముఖ్యంగా అభిమాన హీరో సినిమాలు విడుదల అయ్యాయి అంటే చాలు సినిమాకి వెళ్లాలని చూస్తూ ఉంటారు. దీంతో కుటుంబంతో పాటుగా వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇటీవలే పుష్ప2 థియేటర్ వద్ద జరిగిన సంఘటనలో భాగంగా ఒక తల్లి కొడుకు పుష్ప 2 సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ తొక్కేసలాట జరగగా మహిళ మృతి చెందగా కొడుకు ఆస్పత్రిలో ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు. దీంతో అటు అల్లు అర్జున్ అరెస్ట్ బెయిల్ మీద రావడం ఇలా ఎన్నెన్నో జరిగిపోయాయి.



అప్పటినుంచి తెలంగాణ హైకోర్టు బెన్ఫిట్ షోలను కూడా రద్దు చేయడమే కాకుండా టికెట్లు రేట్లు కూడా తగ్గించింది. అయితే ఇప్పుడు తాజాగా హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేమిటంటే సినిమా థియేటర్లకు 16 ఏళ్లలోపు పిల్లలు వచ్చే సమయాలలో ఆంక్షలు విధించింది హైకోర్టు.. రాత్రి 11 నుంచి ఉదయం 11 గంటల వరకు పిల్లలను థియేటర్లోకి అసలు అనుమతించవద్దు అంటూ అధికారులను హైకోర్టు హెచ్చరిస్తోంది. ఈ విషయం పైన అన్ని వర్గాల వారితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలంటూ సూచించింది.



టికెట్ల ధరల పెంపు, అలాగే ప్రత్యేకమైన షోలో అనుమతి పైన దాఖలైన ఈ పిటిషన్ పైన విచారణ చేసిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలను చేసినట్లు తెలుస్తోంది.. తదుపరి విచారణ వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం..దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఫ్యామిలీతో కలిసి వెళ్లాలి అంటే కేవలం మధ్యాహ్నం 2 గంటల షో కి సాయంత్రం 5 గంటల షోకి మాత్రమే వెళ్లేలా కనిపిస్తోంది. ఇక మిగిలిన సమయాలలో 16 ఏళ్లలోపు పిల్లలకు నో ఎంట్రీ అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ పద్ధతి కేవలం తెలంగాణలో మాత్రమే ఉంటుందా ఏపీలో కూడా ఉంటుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: