మిగతా హీరోయిన్స్ లో లేనిది కీర్తి సురేష్ లో ఉన్నది ఆ ఒక్కటే .. అందుకే అంత స్పెషల్..!
"కీర్తి సురేష్".. ఈ పేరు చెప్తే ఊగిపోని జనాలు ఉంటారా..? ఒకప్పుడు మహానటి సావిత్రి గారు ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో.. తన పేరుకి అందులో సగభాగం ఈ జనరేషన్ హీరోయిన్ అయినా కీర్తి సురేష్ సంపాదించుకుంది అని చెప్పడంలో సందేహమే లేదు . కీర్తి సురేష్ రీసెంట్ గానే బాలీవుడ్ ఇండస్ట్రీలు అడుగు పెట్టింది . ఆమె నటించిన "బేబీ జాన్" సినిమా ఫ్లాప్ అయింది . ఈ సినిమా డిజాస్టర్ టాక్ అందుకుంది . ఈ సినిమాలో ఆమె నటించిన నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఆమె బాలీవుడ్ కెరియర్ ఫ్లాప్ అనే రేంజ్ కి మారిపోయింది . మరీ ముఖ్యంగా కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నెగిటివ్ టాక్ దక్కించుకున్న .. తెలుగులో మాత్రం ఆమెకి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే ఉంది . మరి ముఖ్యంగా తెలుగు జనాలు ఆమెని లైక్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ కీర్తి సురేష్ నిజాయితీ అంటున్నారు చాలామంది జనాలు. మేమేదో వేరే స్టేట్ నుంచి వచ్చాము మాకు ఈ రేంజ్ ..ఆ రేంజ్ ఉండాలి అంటూ డైరెక్టర్స్ కి మేకర్స్ కి కండిషన్స్ పెడుతూ ఉంటారట కొంత మంది హీరోయిన్స్.
కానీ కీర్తి సురేష్ మాత్రం చాలా క్లోజ్ గా ఫ్రెండ్లీగా అందరితో కలిసి పోతుందట. కీర్తి సురేష్ సెట్స్ లో ఎవరితోనూ రూడ్ గా మాట్లాడదట . అందరితో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతుందట . అంతేకాదు కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ విషయంలో కూడా పెద్దగ డిమాండ్ చేయదట . ఆ కారణంగానే మేకర్స్ ఆమెతో ఫ్లాప్ పడినా కూడా ఆమెతోనే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అంటూ కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆమెని పొగిడేస్తూ ప్రశంసిస్తున్నారు. ప్రజెంట్ మ్యారీడ్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది కీర్తి సురేష్. ఎప్పుడు తెలుగు సినిమాలను సైన్ చేస్తుందో..? లేదో..? అంటూ కూడా సందేహ పడుతున్నారు అభిమానులు..!