
సంక్రాంతికి వస్తున్నాం: లిక్కర్ పార్టీ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్ ?
ఈ సినిమాలో వెంకటేష్ కు భార్య పాత్రలో చాలా బాగా నటించింది. తన అమాయకమైన నటన, ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా వెంకటేష్ ని "భా"అంటూ పిలిచి నటిగా వందకు వంద మార్కులు కొట్టేసింది. ఐశ్వర్య రాజేష్ కెరీర్ లో మొదటిసారిగా బ్లాక్ బస్టర్ అయిన తెలుగు సినిమా ఇది. ఇంతకుముందు ఈ బ్యూటీ మూడు నాలుగు సినిమాలు చేసినప్పటికీ అవి ఏవి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్ పాత్రకి మంచి గుర్తింపు లభించింది. నటిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తన కెరీర్ లోనే ఇంతవరకు ఇలాంటి గుర్తింపు ఆమె నటించిన ఏ సినిమాకి కూడా రాలేదు. కాగా, ఈ సినిమా సక్సెస్ కావడంతో నిర్మాత దిల్ రాజు మంచి పార్టీలను ఇస్తున్నారట. అయితే రీసెంట్ గా చెన్నైలోనూ సక్సెస్ మీట్ ను చిత్ర యూనిట్ నిర్వహించింది.
ఈ క్రమంలోనే అక్కడ ఉన్న టీమ్ కి ఐశ్వర్య రాజేష్ స్పెషల్ గా పార్టీ ఇచ్చిందన్న విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో జోరుగా ప్రచారం అవుతుంది. ఈ పార్టీకి చాలామంది గెస్టులు వచ్చి లిక్కర్ తాగి ఎంజాయ్ చేశారట. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటన చూసిన అనంతరం ఐశ్వర్య రాజేష్ కు ఎలాంటి సినిమాలలో అవకాశాలు వస్తాయో చూడాలని అభిమానులు అంటున్నారు.