
డాకు మహారాజ్ మూవీ చూసిన బాలయ్య సోదరి.. వైరల్ అవుతున్న రివ్యూ!
బాలయ్య యాక్టింగ్ విషయంలో తోపు అని డాకు మహారాజ్ మూవీ తనకు ఎంతగానో నచ్చిందని ఆమె పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. బాలయ్య యాక్టింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. డైరెక్టర్ బాబీ తన సినిమాలో మంచి మెసేజ్ ఉండేలా చూసుకోవడంతో పాటు సామాజిక అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు.
ఏదైనా సేవ చేస్తే సేవ చేసిన వాళ్లను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని ఈ సినిమాతో ప్రూవ్ అయిందని ఆమె తెలిపారు. ఎవరైతే నిరంతరం సేవ చేస్తారో వాళ్లు ప్రజల మనస్సులో చిరస్థాయిలో నిలిచిపోతారని పురందేశ్వరి పేర్కొన్నారు. పురందేశ్వరి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. డాకు మహారాజ్ గురించి పురందేశ్వరి పాజిటివ్ రివ్యూ ఇవ్వడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.
డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద గతంలో బాలయ్య నటించిన సినిమాలలో ఏ సినిమా సాధించని స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. డాకు మహారాజ్ మూవీ ఇతర భాషల్లో విడుదల కానుండగా అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. బాలయ్య తర్వాత మూవీ అఖండ2పై అంచనాలు పెరుగుతుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. స్టార్ హీరో బాలయ్యకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. బాలయ్య సినిమా సినిమాకు లుక్స్ విషయంలో వేరియేషన్ చూపిస్తున్నారు.