ఆ విలన్ పాత్రలో నటించే ఛాన్స్ .. బాలయ్య కామెంట్స్ వైరల్ ?

frame ఆ విలన్ పాత్రలో నటించే ఛాన్స్ .. బాలయ్య కామెంట్స్ వైరల్ ?

Veldandi Saikiran
నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకునే సినిమాల్లోకి హీరోగా ప్రవేశించారు. తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. బాలకృష్ణకు విపరీతంగా అభిమానులు ఉన్నారు. బాలయ్య చాలా కాలం నుంచి వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. పవర్ ఫుల్ డైలాగ్స్, మేనరిజం, నటనతో ఆకట్టుకుంటున్నాడు. అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి సినిమాలతో బాలకృష్ణ 100 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నారు. 

తాజాగా బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమాతో బాలకృష్ణ మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. బాలకృష్ణ తదుపరి నటించే చిత్రం అఖండ-2. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.... బాలకృష్ణ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాన్నగారు నటించి దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం సినిమా అంటే తనకు చాలా ఇష్టమని బాలకృష్ణ తెలియజేశారు.


ఆ చిత్రంలో నాన్నగారు రావణాసురుడిగా నెగిటివ్ పాత్రలో నటించారు. రావణాసురుడు నెగటివ్ క్యారెక్టర్ అయినప్పటికీ ఆయన నటించిన విధానానికి అభిమానులు జైజైలు పలికారు. ఆ సినిమాలో రావణాసురుడి హీరో అనే విధంగా ఉంది. ఈ సినిమా తర్వాత ఏంటి దానవీరశూరకర్ణ సినిమాలో దుర్యోధనుడిగా నెగిటివ్ పాత్రలో నటించారు. ఆ సినిమా కూడా చరిత్రలు తిరగరాసింది.


మా నాన్నగారిలా నాకు రావణాసురుడి పాత్రలో నటించే అవకాశం జీవితంలో వస్తుందో రాదో అంటూ బాలకృష్ణ గతంలో కొన్ని కామెంట్స్ చేశారు. నర్తనశాల సినిమాలో బాలయ్య మల్టీపుల్ రోల్స్ లో నటించడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మరి బాలకృష్ణ కోరిక తీర్చడానికి ఎవరైనా దర్శక నిర్మాతలు ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: