మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య పెరిగిన దూరం?

frame మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య పెరిగిన దూరం?

Veldandi Saikiran
మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య ఎప్పుడు ఏదో ఒక వివాదాలు ఉన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ వార్తలపై అల్లు కుటుంబం కానీ మెగా కుటుంబం కాని ఎప్పుడూ స్పందించలేదు. రీసెంట్ గా అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో మెగా కుటుంబ కుటుంబం నుంచి చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ వెంటనే వచ్చారు.

దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ వచ్చింది. అయితే తాజాగా మరోసారి ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయనే వార్త తెరపైకి వస్తోంది. దానికి గల ప్రధాన కారణం సంక్రాంతి పండుగను మెగా అల్లు కుటుంబ సభ్యులు వేరువేరుగా జరుపుకున్నారు. గతంలో సంక్రాంతిని ఈ రెండు కుటుంబ సభ్యులు ఒకే చోట కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.

వారం రోజుల పాటు అక్కడే ఉండి సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. కానీ ఈ సంవత్సరం సంక్రాంతిని ఎవరి ఇంట్లో వారే చేసుకోవడంతో ఈ రెండు కుటుంబాల మధ్య మళ్లీ ఏవో గొడవలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. కాగా, రామ్ చరణ్ తన భార్య బిడ్డతో కలిసి ఫోటో దిగి ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఉపాసన కూడా ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

ఇక అదే తరహాలో అల్లు అర్జున్ కూడా తన భార్య పిల్లలతో కలిసి ఫోటో దిగి ఆ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈసారి సంక్రాంతి పండుగను ఎవరింట్లో వారే సెలబ్రేట్ చేసుకోగా.... ఈ రెండు కుటుంబాల మధ్య మళ్లీ ఏవో గొడవలు ఉన్నాయంటూ భారీ ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలపై మెగా కుటుంబ సభ్యులు, అల్లు కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. మొత్తానికి తాజాగా గా బయటకు వచ్చిన  ఫోటోలు మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య  చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: