"బన్నీ ఒక్కడే కాదు ఎన్టీఆర్ కూడా.."..హీట్ పెంచేస్తున్న లేటెస్ట్ న్యూస్..!

frame "బన్నీ ఒక్కడే కాదు ఎన్టీఆర్ కూడా.."..హీట్ పెంచేస్తున్న లేటెస్ట్ న్యూస్..!

Thota Jaya Madhuri
ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త బన్నీ - తారక్ ఫ్యాన్స్ కు ఓ రేంజ్  లో పూనకాళ్లు తెప్పిస్తుంది.  మిగతా స్టార్ హీరోల ఫ్యాన్స్ కి కడుపు మండిపోయేలా చేస్తుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బన్నీ పేరు ఎలా ట్రోలింగ్ కి గురి అయిందో మనకు తెలిసిందే. అనవసరంగా పొలిటికల్ పరంగా బన్నీ పేరును లాగుతూ కావాలనే కొందరు టార్గెట్ చేసి మరి బన్నీ కెరియర్ ని తొక్కేయడానికి ట్రై చేశారు . కానీ బన్నీ సేఫ్ గా బయటపడ్డాడు . బన్నీ పేరు పై నెగిటివ్ ట్రోలింగ్ జరిగిన బన్నీ ఏమాత్రం రెస్పాండ్ అవ్వకుండా తన ఫాన్స్ ని కంట్రోల్లో పెట్టుకుంటూ తన పని తను చూసుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు .

కాగా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా డైరెక్టర్ అయిన సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  దీంతో తెలుగు హీరోలు మొత్తం కుళ్ళుకొని చచ్చిపోతున్నారు. సంజయ్ లీల భన్సాలీ డైరెక్షన్ లో సినిమా అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి అంటూ జనాలు ఫీల్ అయిపోతూ ఉంటారు.  అయితే రీసెంట్ గానే బన్నీ ముంబైకి వెళ్లి మరి సంజయ్ లీలా భన్సాలీ ను కలిసి రెండు గంటలపాటు మాట్లాడారు .

దీంతో వీళ్ళ కాంబోలో సినిమా ఫిక్స్ అంటూ జనాలు బాగా గట్టిగా నిర్ణయించుకున్నారు . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరొక తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించబోతున్నాడు అన్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . దీంతో తెలుగు జనాలు షాక్ అయిపోతున్నారు . బన్నీ - తారక్ ఒకే సినిమాలోనా..? దీనమ్మ ఇక బాక్స్ ఆఫీస్ మడత పడిపోవాల్సిందే అంటూ ఓ రేంజ్ లో బన్నీ - తారక్ ఫాన్స్ పొగిడెస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నో డౌట్ పుష్ప2  రికార్డ్స్ బ్రేక్ చేసే మూవీ ఇదే అవుతుంది అంటున్నారు సినీ ప్రముఖులు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: