సంక్రాంతికి వస్తున్నాం సినిమా మిస్‌ చేసుకున్న హీరోయిన్‌ ?

frame సంక్రాంతికి వస్తున్నాం సినిమా మిస్‌ చేసుకున్న హీరోయిన్‌ ?

Veldandi Saikiran
విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అని తెలిసినప్పటి నుంచి అభిమానులు సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వారి అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అనిల్ రావిపూడి ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా నిన్న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.

ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్లుగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. వెంకటేష్ తన విశ్వరూపాన్ని అభిమానులకు ప్రదర్శించాడు. ఆయన భార్య పాత్రకి ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా చెప్పవచ్చు.

లవర్ పాత్రలో మీనాక్షి చౌదరి అందంగా మెరిసి అలరించింది. కాగా, ఈ సినిమా సక్సెస్ టాక్ తో దూసుకుపోవడంతో నిన్న సాయంత్రం చిత్రబృందం సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఇందులో వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు, శిరీష్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ పాత్రను నటి కాజల్ మిస్ చేసుకుందట. మొదట ఈ సినిమాలో కాజల్ ను పెట్టి సినిమా తీయాలని అనుకున్నారట.

అయితే ఆమె కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదట దీంతో ఐశ్వర్య రాజేష్ ను సంప్రదించగా ఆమె వెంటనే ఒప్పుకుందట. వెంకీ భార్య పాత్రలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఈ విషయం తెలిసి కాజల్ అభిమానులు ఇంత మంచి సినిమాను మిస్ చేసుకున్నావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో కాజల్ నటించి ఉంటే సినిమా మరింత సక్సెస్ అయ్యుండేదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: