ఇదేం పెంట పని..మళ్లీ అదే తప్పు చేస్తున్న కీర్తి సురేష్..ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు పో..!

frame ఇదేం పెంట పని..మళ్లీ అదే తప్పు చేస్తున్న కీర్తి సురేష్..ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు పో..!

Thota Jaya Madhuri
కీర్తి సురేష్ .. నిన్న మొన్నటి వరకు మహానటి అంటూ జనాల చేత పిలిపించుకుంది. కానీ ఇప్పుడు పరిస్ధితి వేరే లా మారిపోయింది. మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొంటూ వస్తుంది ఈ హీరోయిన్. దానికి కారణం కూడా అందరికి తెలిసిందే. తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో కానీ కీర్తి సురేష్ తన అభిమానులకి కూడా నచ్చని పనులు చేస్తూ ఆమెపై నిందలు వేయించుకునే స్థాయికి మారిపోయింది .


కీర్తి సురేష్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంత సేపు చాలా చాలా మంచి పేరు తెచ్చుకునింది. ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్న సరే ఆమె పర్సనల్ విషయాలు కారణంగా బాగా ప్రశంసలు దక్కించుకునేది. అంతే కాదు సినీ ఇండస్ట్రీకి కీర్తి సురేష్ లాంటి హీరోయిన్ కావాలి అంటూ చాలామంది పొగిడేశారు. అయితే ఏ ముహూర్తాన బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో కానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది . ఒకటి కాదు రెండు కాదు వేల కామెంట్స్ ఆమె పై నెగటివ్ గా రావడం సంచలనంగా మారింది.


పెళ్లి తర్వాత ఆమె నటించిన ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది. "బేబీ జాన్" సినిమా రిలీజై ఫ్లాప్ టాక్ దక్కించుకుంది. కీర్తి సురేష్ నటనకు నెగిటీవ్ మార్కులు వేయించుకుంది . చాలా చాలా బాలీవుడ్ జనాలు ఆమెను ట్రోల్ చేసారు. అయితే ఈ దెబ్బతో కీర్తి టాలీవుడ్ సినిమాలకి దగ్గరవుతుంది ..బాలీవుడ్ సినిమాలకి దూరమవుతుంది అని అంతా అనుకున్నారు. అయితే కీర్తి సురేష్ మళ్లీ ఒక బాలీవుడ్ సినిమాకి సైన్ చేయడం ఇప్పుడు ఫ్యాన్స్ కి మండిపోయేలా చేస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ ఇంత అవమానిస్తే మళ్లీ ఆ సినిమాలనే ఎందుకు సైన్ చేస్తుంది అంటూ కీర్తి సురేష్ పై ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. కీర్తి సురేష్ పెద్ద తప్పు చేస్తుంది అంటూ మండిపడుతున్నారు. ఇక ఆమె కెరియర్ సెట్ అవ్వదు అని.. ఆ దేవుడు కూడా కాపాడలేడు అని మాట్లాడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: