మహేష్ బాబు ఫ్లాప్ మూవీ రీ రిలీజ్.. ఏ సినిమా అంటే..?
ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా మహేష్ బాబు హీరోగా అమృత రావు హీరోయిన్గా నటించారు.. 2007లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మణిరత్నం సంగీతాన్ని అందించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ మహేష్ బాబు నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ చేయడంతో అభిమానులు ఈ సినిమాని థియేటర్లో చూసేందుకు ఎంత మేరకు ఆసక్తిగా ఉన్నారో అర్థం కావడం లేదు. మరి ఎలాంటి రికార్డులను బద్దల కొడుతుందో చూడాలి.
గత ఏడాది జనవరి 12న మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో తన 29వ చిత్రంలో నటిస్తూ ఉన్నారు మహేష్. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా చాలా గ్రాండ్గా జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా జరగబోతోంది. ఇందులో నటీనటులకు సంబంధించి ఇంకా అధికారికంగా చిత్ర బృందం ప్రకటించలేదు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించడమే కాకుండా నాలుగేళ్లు తమ డేట్ లను మహేష్ బాబు కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో కచ్చితంగా మహేష్ బాబు కూడా పాన్ వరల్డ్ హీరోగా పేరు పొందుతారని అభిమానులు ధీమాతో ఉన్నారు.