ఒకే ఒక్క పాట కోసం 365 రోజులు ధియేటర్ హౌస్ ఫుల్ అయిన సినిమా ఇదే .. ఇంతకీ హీరో ఎవరంటే..?
అదెలా సాధ్యం అనుకుంటున్నారా ? అవును ఇది సాధ్యమే. " చినుకు చినుకు అందెలతో " అనే పాట అందరూ చూసే ఉంటారు . ఈ పాట ఇప్పటికీ కూడా అందరిని ఆకట్టుకుంటుంది . ఈ సాంగ్ లో బాబు మోహన్ తో స్టార్ హీరోయిన్ సౌందర్య స్టెప్పులేసి అప్పట్లో అందరిని ఆకర్షించింది . అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబు మోహన్ ఈ పాట గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .
అయన మాట్లాడుతూ..." నేను థియేటర్ కు వెళ్ళినప్పుడు అక్కడ నాది , సౌందర్యాది కలిసి ఒక పెద్ద కటౌట్ చూసి ఆశ్చర్య పోయాను . దాని మీద 365 రోజులు అని రాసి ఉంది . అది చూసి ఆశ్చర్యం కలిగింది . ఆ క్షణం నా జన్మ ధన్యమైపోయింది . కేవలం " చినుకు చినుకు " అనే సాంగ్ కోసం హౌస్ ఫుల్ అయిపోయిందట . సాంగ్ టైం కు ప్రేక్షకులు రావడం ఆ పాట అయిపోయిన తర్వాత తిరిగి వెళ్లిపోవడం జరిగిందట . కేవలం ఆ ఒక్క పాట కోసం జనం ఎగబడ్డారు " అంటూ చెప్పుకొచ్చాడు బాబు మోహన్ . ప్రస్తుతం అయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .