AAA సినిమా ట్వీట్ వైరల్.. మళ్లీ మెగా- అల్లు ఫాన్స్ మధ్య చిచ్చు..!

frame AAA సినిమా ట్వీట్ వైరల్.. మళ్లీ మెగా- అల్లు ఫాన్స్ మధ్య చిచ్చు..!

Divya
ఈ మధ్యకాలంలో ఏదైనా సినిమా విడుదలవుతోందంటే చాలు ఆ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో చాలామంది ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. దీంతో ఏ హీరో కూడా తమ అభిమానులను కంట్రోల్ చేయలేకపోతున్నారని చెప్పవచ్చు. ఈరోజులలో హీరోలు  సైతం ఆఫ్ స్క్రీన్ లో ఎంత మంచి రిలేషన్ మెయింటైన్ చేసినా కూడా అభిమానులు మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ నానా రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా మెగా - అల్లు వారి కుటుంబాల మధ్య లో లోపల ఏం జరుగుతుందో తెలియదు కానీ అభిమానుల మధ్య మాత్రం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా మారిపోయారు.

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విషయంలో చాలామంది ట్రోల్ చేయడం జరిగింది. అయినా రికార్డులో వేట మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా పైన ఇప్పుడు ఎంత ట్రోలింగ్ జరుగుతోందో చెప్పాల్సిన పనిలేదు.. ఎన్టీఆర్ ,అల్లు అర్జున్ అభిమానులు రామ్ చరణ్ సినిమాని డిజాస్టర్ అంటూ వైరల్ గా చేస్తున్నారు. ఇక ఆన్లైన్ ట్రోలింగ్ గురించి చాలా దారుణంగా ఉన్నది. అయితే కొంతమంది కొన్నిసార్లు తెలియకో తెలుసా అధికారిక ఖాతాలనుంచి కొన్ని ట్రిట్లు షేర్ చేస్తూ ఉంటారు. అయితే వారి ఉద్దేశం ఎలాంటిది లేకపోయినా అభిమానులు మాత్రం తెగ రచ్చ చేస్తూ ఉంటారు.


ఇప్పుడు అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకు సంబంధించి AAA సినిమాస్ వారు ఒక డైలాగును షేర్ చేశారు. దీంతో ఈ డైలాగ్ ఇప్పుడు ఎందుకు షేర్ చేయవలసి వచ్చింది వారి ఉద్దేశం ఏంటి అనే విధంగా రాంచరణ్ అభిమానులు కూడా కామెంట్స్ చేయడం జరుగుతోంది.AAA సినిమాస్ వారు అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్" మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి.. కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్" అనే డైలాగ్ షేర్ చేయడం జరిగింది దీంతో ఒకసారి గా అటు అల్లు, మెగా ఫ్యాన్స్ మధ్య మరొకసారి చిచ్చు పెట్టినట్టుగా మారిపోయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: