జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి పరిచయం అవసరం లేదు. ప్రసాద్ తన నటనతో అందరినీ నవ్విస్తూ ఉంటాడు. అయితే అందరినీ కడుపుబ్భా నవ్వించే పంచ్ ప్రసాద్ కొన్నేళ్లపాటు కిడ్నీ సమస్యతో బాధపడ్డాడు అంట. దాంతో పాటు రెండు మూత్రపిండాలు పాడవ్వడం. ఆయన డయాలసిస్ చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగవలేదు అంట. ఆపరేషన్ తప్పనిసరి అని లేకపోతే కష్టమని వైద్యులు చెప్పారట.
ఆ సమయం కిడ్నీ దానం చేసేందుకు ఎవరు లేకపోతే తన భార్య సునీత ముందుకు వచ్చి.. తన కిడ్నీ దానం చేసేందుకు సిద్ధమైంది అంట. అయితే డాక్టర్లు భవిష్యత్తులో మళ్లీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రసాద్ భార్య కిడ్నీ ఉపయోగిద్దామని చెప్పారంట. తర్వాత వేరే ఒక దాత దొరకడంతో విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది అంట. అయితే ఆ ఆపరేషన్ కి లక్షల్లో ఖర్చు అవుద్దీ అని తెలిసి ప్రసాద్ బాధపడితే.. ఆ సమయంలో మంత్రిగా ఉన్న రోజా.. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది అంట. ఆయన ఆదేశంతో సహాయనిధి మంజూరు అయింది అని ప్రసాద్ చెప్పుకొచ్చాడు.
తాజాగా ఓ టీవి షోకి హాజరైన ప్రసాద్ తన భార్య సునీత గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. 'ప్రేమించుకున్నవాళ్లు కలిసి బతకడానికి పెళ్లి చేసుకుంటారు. కానీ నన్ను బతికించడం కోసమే ఆమె నన్ను పెళ్లి చేసుకుంది. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆస్పత్రికి వెళ్లాలి. కానీ తన గురించి వదిలేసి నా చుట్టూ తిరిగింది. నువ్వు చేసిన పనికి ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు. మామూలుగా తల్లిదండ్రుల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటారు. ఇప్పుడు నేనూ అదే చేయాలనుకుంటున్నా' అని అన్నాడు. ఈ సందర్భంగా ప్రసాద్ భార్యను కూర్చోబెట్టి తాంబూలంలో ఆమె కాళ్లు కడిగి.. ఆ నీళ్లను తన నెత్తిన చల్లుకున్నాడు. అది చూసి సునీత కూడా కన్నీళ్లు పెట్టుకుంది.