
గేమ్ ఛేంజర్ రివ్యూ: అప్పన్న- రామ్ నందన్.. ఎవరి పాత్ర బెస్ట్ అంటే..?
సాంగ్స్ పరంగా కూడా తమన్ అద్భుతమైన పాటలను అందించడమే కాకుండా మ్యూజిక్ కూడా అందించారు. ఇందులో హీరోయిన్స్ గా కియారా అద్వానీ, అంజలి వంటి వారు నటించారు. ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా టాక్ ప్రకారం ఈ సినిమా మొదలైన 15 నిమిషాలకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నదట. అలాగే సినిమా నెమ్మదిగా కథలోకి వెళుతున్నట్లు ఆడియోస్ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాలు కూడా మెప్పించేలా ఉన్నాయని సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ నటించిన ఐఏఎస్ ఆఫీసర్ మినిస్టర్ మధ్య జరిగేటటువంటి కొన్ని సన్నివేశాలు హైలెట్గా ఉన్నాయట.
అలాగే ఫ్లాష్ బ్యాక్ లో బాగా కనెక్ట్ అయ్యే స్టోరీ కూడా ఉన్నదంటూ వార్తలు వినిపిస్తున్నాయి అలాగే ఇందులోని సాంగ్స్ విజువల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్టుగా తెలుపుతున్నారు. ఇందులో డైలాగులు తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉన్నదట. ఇందులో కొన్ని విజువల్స్ అయితే బాగానే ఆకట్టుకున్నాయట అయితే రామ్ చరణ్ నటించిన అప్పన్న, రామ్ నందన్ పాత్రలలో అప్పన్న పాత్ర రామ్ చరణ్ కెరియర్ లోనే ఒక బెస్ట్ పాత్ర అవుతుందంటూ తెలుపుతున్నారు. మొత్తానికి గేమ్ ఛేంజర్ సినిమాతో రామ్ చరణ్ హిట్ కొట్టారని కొంతమంది చెబుతూ ఉండగా మరి కొంతమంది అంత లేదంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పూర్తి రివ్యూ మరికొన్ని గంటలలో బయటికి రాబోతోంది.