"ఆ హీరోయిన్ ని భరించలేను..నా సినిమాలో వద్దు బాబోయ్".. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్..!
అంత మంచి మనిషి జూనియర్ ఎన్టీఆర్ . మరి ముఖ్యంగా హీరోయిన్స్ తో చాలామంది హీరోస్ మూవీ షూట్ లో పాల్గొన్నప్పుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ..మిస్ బిహేవ్ చేస్తూ ఉంటారు . కొంతమంది పరోక్షంగా హీరోయిన్ లని హర్ట్ చేస్తూ ఉంటారు ..కానీ తారక ది మాత్రం అలాంటి మైండ్ సెట్ కాదు. పెద్దవాళ్ళను గౌరవిస్తూ చిన్నవాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చాలా చాలా హుందాగా ఇండస్ట్రీలో నడుచు కుంటూ వస్తున్న హీరో. అయితే అలాంటి ఒక టాప్ హీరో నా సినిమాలో ఆ హీరోయిన్ వద్దు అంటూ ఓపెన్ గా ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టడం సంచలనంగా మారింది.
ఇదేదో కోపంగానో.. పగతోనో కాదు.. చాలా సరదాగా ఫ్రెండ్లీగా.. ఆ హీరోయిన్ తో ఉన్న చదువుతో ఇలా మాట్లాడాడు . జూనియర్ ఎన్టీఆర్ కి సమంత అంటే చాలా చాలా ఇష్టం . వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమాలు మంచి హిట్ అయ్యాయి. కాగా వీళ్ళ కాంబోలో ఆఖరిగా వచ్చిన సినిమా జనతా గ్యారేజ్. సెప్టెంబర్ 1 , 2016న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అందుకుంది . ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది . మరొక హీరోయిన్గా నిత్యామీనన్ కనిపించింది . అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లోనే తారక్ మాట్లాడుతూ " ఈవిడకి పెళ్లి అయిపోతుందిగా..హ్యాపీ..పెళ్లి తరువాత నటించవుగా.. ఇక ప్ర్శాంతంగా ఉండచ్చు.. నా సినిమాలో ఈమె వద్దు బాబోయ్" అంటూచాలా సరదాగా మాట్లాడాడు . అప్పుడు ఆ ఇంటర్వ్యూలో పక్కనే సమంత కూడా ఉండింది. దీంతో సోషల్ మీడియాలో అప్పుడు ఈ ఇంటర్వ్యూ క్లిప్ బాగా హైలైట్ గా మారింది .