' డాకూ మ‌హారాజ్ ' బాల‌య్య పాన్ ఇండియా మోత మోగుతోంది... !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి బాలకృష్ణ - దర్శకుడు కొల్లు బాబి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ డాకు మహారాజ్‌. సితార ఎంటర్టైన్మెంట్స్ - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ .. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. తమన్‌ సంగీతమ అందించిన ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ - ఊర్వసి రౌతేలా - శ్రద్ధ శ్రీనాథ్ - చాందిని చౌదరి హీరోయిన్గా నటించారు. సంక్రాంతి కానుక గా జనవరి 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఇప్పటికే ట్రైలర్తో సినిమాపై సూపర్ బజ్‌ ఏర్పడగా మొన్నటిదాకా రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అనుకున్న ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ట్రైల‌ర్ త‌ర్వాత డాకు మహారాజ్ మేకర్ ప్లాన్ మొత్తం మార్చేశారు. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి ఇది నేషనల్ లెవెల్ లో వర్కౌట్ అయ్యేలా ఉందని ఫిక్స్ అయిపోయారు.

ఈ క్రమంలోనే తెలుగు తో పాటు తమిళ్ - హిందీ వర్షన్ రెడీ చేస్తున్నారు. జనవరి 12న తెలుగుతో పాటు తమిళ్ - హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. డాకు మహారాజ్ సినిమాకు నేషనల్ లెవెల్ లో క్రేజ్‌ రావటం ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తోంది. సీనియర్ బాలకృష్ణ ఇటీవల వరుస హిట్ల తో దూసుకు వెళుతున్నాడు. బాలయ్య సినిమా అంటే చాలు రిజల్ట్ సూపర్ హిట్ అనేలా ఉంది. కథ‌ ఏదైనా బాలయ్య యాక్షన్ మాత్రం మిస్ అవ్వదు. తెలుగులో ఈ సినిమా జ‌బ్ చూసి తమిళ్, హిందీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి డిమాండ్ రావ‌డంతో లాస్ట్ మినిట్ లో డాకు మహారాజ్ ని తమిళ్, హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: