సంక్రాంతి మూడు సినిమాల రేంజ్ ఇదే .. ఒక్కో సినిమాకు ఒక్కో రేంజ్ ..!
ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు వస్తున్నాయి .. అవి ఎలా ఉంటాయి ? ఎలా ఉండబోతున్నాయి ? ఎలా ఉంటే బాక్సాఫీస్ దగ్గర తమ టార్గెట్ రీచ్ అవుతాయి ? అనే విషయాలు ఈ స్టోరీలో చూద్దాం. గేమ్ ఛేంజర్ రేంజ్: ప్రజెంట్ చిత్ర పరిశ్రమలో వేవ్ అంతా ఫ్యాన్స్ , యూత్ , మాస్ కంటెంట్ చుట్టూ తిరుగుతుంది .. పెద్ద సినిమా భారీ కథ అంతా ఆ విధంగా రివాల్వ్ అవుతుంది .. ప్రేక్షకులు ధియేటర్లకు వెళ్లేలా చేసేవి కూడా ఈ పాయింట్లే .. వెళ్లిన తర్వాత ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా కూర్చోబెట్టేది మాత్రం భారీ కథ.. వాటికి తగ్గిన స్క్రీన్ ప్లే ప్లస్ యాడేడ్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఎక్కడా ప్రేక్షకులకు బోర్ కట్టకుండా ఉంచాతయి అన్నది బట్టి సినిమా సక్సెస్ పై ఆధారపడి ఉంటుంది.
డాకు మహారాజ్: పక్క మాస్ మసాలా లాంటి సినిమా.. బాలయ్య సినిమా అంటే ఎలా ఉండాలి .. బలమైన హీరో పాత్ర అంతకన్నా బలమైన విలన్ క్యారెక్టర్ వీళ్ళిద్దరి మధ్య యుద్ధం కోసం ఓ బలమైన పాయింట్ ఉండాలి .. ఇక వీటికి తోడు మరింత బలమైన ఫ్లాష్ బ్యాక్ అందులో ఇంకా బలమైన హీరో క్యారెక్టర్ .. ఇవే మెయిన్ ప్యాకింగ్ మెటీరియల్ .. ఎంత ఆకర్షణీయంగా ప్యాక్ చేస్తారు అన్నది బట్టి సినిమా రిజల్ట్ ప్రేక్షకులు డిసైడ్ చేస్తాడు. సంక్రాంతికి వస్తున్నాం: ఇక ఈ సినిమా మిగిలిన సినిమాలు తో పోలిస్తే బడ్జెట్ ప్రకారం చిన్న సినిమా ..
కానీ రేంజ్ లో మాత్రం ఏం మాత్రం తీసిపోని సినిమా సైలెంట్ సంక్రాంతి విన్నర్ ఈ సినిమానే అవుతుందేమో అని అనుమానం కూడా అందరిలో ఉంది .. ఇక ఎందుకంటే పాటలు హిట్ అయ్యాయి .. . ఫన్ కూడా హిట్ అయితే అంతకన్నా కావాల్సింది ఉండదు. సంక్రాంతి సీజన్ గనుక సినిమా మినిమం ఉంటే చాలు ..ఇలా మొత్తం మీద మూడు సినిమాలు మూడు విధాలుగా ఉన్నాయి .. ఇలానే ఉండాలి ఇలా ఉంటే చాలు సంక్రాంతికి ప్రేక్షకులకు మూడు సినిమాల్లో ఏది బాగా నచ్చుతుందనేది చూడాలి.