ఎన్టీఆర్ - ప్రభాస్ మైత్రి వారి డబుల్ ధమాకా .. ఇండియన్ బాక్సాఫీస్‌కు హాడల్..!
ఇదే క్రమంలో వచ్చే 2026 కోసం ఇప్పటినుంచి ప్లానింగ్ చేస్తున్నారు .. ఇక 2026 ను ఫెస్టివల్ స్పెషల్ గా మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీస్‌ను తీసుకువచ్చేందుకు రెడీ చేస్తున్నారు .. ఈ ఏడాదిని పాన్ ఇండియా హీరో సినిమాతో మొదలుపెట్టి మరో పెద్ద హీరో మూవీతో గ్రాండ్గా ముగించాలని చూస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ వారు. అయితే మైత్రి లైన్ అప్ లో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా 2026 సంక్రాంతి కనుక జనవరి 9న రిలీజ్ కానుంది. అలాగే అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా మేకర్స్ ఇప్పటికే ఇచ్చేశారు. ఇక జనవరి చివరలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ మొదలు కానుంది .. ఫిబ్రవరిలో ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్లో అడుగుపెట్టబోతున్నారని ప్రచారం జరుగుతుంది.
ప్రజెంట్ వార్ 2 షూటింగ్ను పూర్తి చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత నీల్ తెరక్కెకించే మాస్ ఎంటర్టైనర్ షూటింగ్లోకి ఎంట్రీ ఇవ్వన్నారట .. ఇక మరో పక్క సీతారామం దర్శకుడు హనురాఘపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఒకవేళ అన్ని కుదిరితే ఈ సంవత్సరం దసరకు కు విడుదల చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. పీరియాటిక్ యాక్షన్ లవ్ స్టోరీ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది .. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యే టైం లో ఈ మూవీ సాగుతున్నట్లు తెలిసింది ప్రభాస్ ఓ సైనికుడుగా కనిపించనున్నారట ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరి 2026లో మైత్రీ ప్లాన్ ఎంతటి సక్సెస్ అవుతుందో చూడాలి.