అరె వావ్: ఆ పాన్ ఇండియా సినిమాలో రష్మీ..ఇన్నాళ్లకు దశ తిరిగిదా..?
అయితే ఇన్నాళ్లు వెయిట్ చేసినందుకు రష్మీకి మంచి అవకాశం దొరికినట్లు తెలుస్తుంది. కాగ ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ 2 సినిమాలో రష్మీ ఓ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక బడా ప్రొడ్యూసర్ రికమండేషన్ కారణంగానే రష్మీ ఇంత పెద్ద అవకాశం అందుకుందట. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా మూమెంట్ రష్మీ ఖాతాలో పడడంతో ఆమె ఫుల్ ఎంజాయ్ చేసేస్తుందట. ఈ సినిమాలో తన ఒరిజినల్ నటన ఏంటో చూపించాలి అన్న రేంజ్ లో ప్రాక్టీస్ చేస్తుందట.
ప్రశాంత్ నీల్ సైతం ఈ పాత్ర బాగా చేయగలరు రష్మి అంటూ నమ్ముతున్నారట . కనిపించేది చాలా తక్కువ టైం అయినా సినిమాలో.. కానీ ఆమె క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేశారట . అంత మంచి క్యారెక్టర్ రష్మి ఖాతాలో పడటానికి ప్రభాస్ జాన్ జిగిడి అయినా ప్రొడ్యూసర్ ఫ్రెండే కారణం అంటూ కూడా తెలుస్తుంది . ఆ ప్రొడ్యూసర్ రష్మీకి బాగా బాగా మంచి స్నేహితుడు అని కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇది టోటల్ గా ఫేక్ అంటూ కొట్టి పడేస్తున్నారు. రష్మీకి సలార్ 2 లో ఛాన్స్ నా..? నో వే .. ఇదంతా ఫేక్ .. ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారు. ఆ సినిమాలో నటించే కటౌట్ కాదు ఆమెది అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . కొంతమంది మాత్రం రష్మీలో మంచి నటి దాగుంది అని .. సరిగ్గా డైరెక్టర్ వాడితే ఆ నటి బయటకు వస్తుంది అని..ఆమెని సపోర్ట్ చేస్తున్నారు..!