పెళ్లి తర్వాత ఫస్ట్ సినిమాకి సైన్ చేసిన శోభిత ధూళిపాళ్ల..అది కూడా తెలుగులోనే..హీరో ఎవరంటే..?

Thota Jaya Madhuri
 
శోభిత ధూళిపాల .. ఇప్పుడు అక్కినేని ఇంటికి కోడలుగా రాజ్యమేలేస్తుంది . నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్. స్టార్ హీరోయిన్ అని కూడా చెప్పలేం . అడపాదడపా హిట్స్ అందుకుంది . బాలీవుడ్ లో బాగా సినిమాలో నటించింది. పలు బోల్డ్ వెబ్ సిరీస్ లో కూడా విజృంభించేసింది. అయితే ఎప్పుడు మొదలైందో ..? ఎలా మొదలైందో..? తెలియదు కానీ అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని నాగచైతన్య తో ప్రేమలో పడింది . ఆ తర్వాత గుడ్డు చప్పుడు కాకుండా కొన్నాళ్లు ప్రేమను మైంటైన్ చేసి రీసెంట్ గానే వివాహ బంధంతో భార్యాభర్తలుగా మారిపోయారు నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల.
అయితే శోభిత ధూళిపాళ్ల పెళ్లి తర్వాత ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు. కొన్ని ఆఫర్స్ వస్తున్నా సరే ఇంకా టైం పడుతుంది అంటూ ఆఫర్స్ రిజెక్ట్ చేసింది . అయితే ఎవరూ ఊహించిన విధంగా శోభిత ధూళిపాళ్ల ఒక తెలుగు సినిమాకి సైన్ చేయడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం..శోభిత ధూళిపాళ్ళ ఒక తెలుగు హీరో సినిమాకి సైన్ చేసిందట . అది కూడా ఒక టైర్ 2 హీరో సినిమాకి. శోభిత ధూళిపాళ్ల ఓ  రేంజ్ ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఒకప్పుడు అంటే ఏదో ఒక సినిమాలో నటించేసేది . కానీ ఇప్పుడు మాత్రం ఆమె రేంజ్ పూర్తిగా మారిపోయింది . అయినా సరే.. ఓ టైర్ 2 హీరో సినిమాతో నటించడానికి ఓకే చేసిందంటే మాత్రం ఆ స్టోరీర్లో ఏదో ఒక్క బిగ్ ట్వీస్ట్ ఉండనే ఉంటుంది అంటున్నారు జనాలు. డైరెక్టర్ చెప్పిన కథ బాగా నచ్చేసి హోమ్లీ పాత్ర కావడంతో మ్యారేజ్ తర్వాత ఎంట్రీకి తెలుగు ఇండస్ట్రీలో ఇదే ది బెస్ట్ మూవీ అని ఫిక్స్ అయ్యి మరి ఈ సినిమా అగ్రిమెంట్లపై సైన్ చేసిందట . ఫస్ట్ టైం పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ్ల తెలుగు సినిమాలో కనిపిస్తుంది అని తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..!
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: