దసరా: నాని ఊర మాస్ మూవీ..ఒక్క దెబ్బతో 100 కోట్లు.. దెబ్బకు ఆ రికార్డులన్నీ ఆంఫట్.?

Pandrala Sravanthi
నాని కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ దసరా..శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కీర్తి సురేష్ నాని హీరో హీరోయిన్లుగా దీక్షిత్ శెట్టి కీలకపాత్రలో నటించిన దసరా మూవీ శ్రీరామనవమి కానుకగా మార్చి 30, 2022లో విడుదలై మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది.నాని కెరియర్ లోనే మొదటి పాన్ ఇండియా మూవీ దసరా. ఈ సినిమా 5 భాషల్లో దాదాపు 3,000 థియేటర్లలో విడుదలైంది. అలా నాని కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా దసరా మూవీ చోటు సంపాదించుకుంది. అంతేకాదు ఈ సినిమాతో నాని రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో విస్తరించింది. అయితే అలాంటి నాని దసరా మూవీకి సంబంధించిన కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 అద్భుతమైన ప్రేమ కథా సినిమాతో ధరణి అనే పాత్రలో ఒదిగిపోయి నటించారు నాని. అలాగే కీర్తి సురేష్ కూడా డీ గ్లామరస్ రోల్ లో చాలా అద్భుతంగా నటించింది. ఇక మొదట కీర్తి సురేష్ నాని ఫ్రెండ్ ని ప్రేమిస్తుంది. కానీ నాని ప్రేమిస్తున్న విషయం కీర్తి సురేష్ కి గానీ సూరి పాత్రలో నటించిన దీక్షిత్ శెట్టికి గాని తెలియదు.కానీ కీర్తి సురేష్ దీక్షిత్ శెట్టిల పెళ్లయ్యాక నాని ప్రేమ విషయం దీక్షిత్ శెట్టికి తెలుస్తుంది. కానీ పెళ్లయిన మొదటి రోజే దీక్షిత్ శెట్టి మరణించడంతో నాని కీర్తి సురేష్ ని పెళ్లి చేసుకుంటాడు. అలా సినిమా స్టోరీ సాగుతుంది. ఇక ఈ సినిమాలో నాని చెప్పిన బ్యాంచత్ డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది.తెలంగాణ సాంస్కృతిక అద్దం పట్టేలా ఈ సినిమాలోని డైలాగులు తెలంగాణ భాష యాసని చూపించారు శ్రీకాంత్ ఓదెల.

భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ 100 కోట్లు సాధించి నానిని మొదటిసారి 100 కోట్ల క్లబ్లో చేర్చింది. అలాగే ఈ సినిమా చూసిన రాజమౌళి, మహేష్ బాబు వంటి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు కూడా నాని యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు. అలాగే నాని దసరా మూవీ ఐఫా, ఫిలింఫేర్ అవార్డుల్లో కూడా సత్తా చాటింది.ముఖ్యంగా ఫిలింఫేర్ అవార్డుల్లో బెస్ట్ హీరోగా నానికి బెస్ట్ హీరోయిన్గా కీర్తి సురేష్ ఇద్దరికీ అవార్డులు వచ్చాయి. అలాగే బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి,బెస్ట్ సినిమా ఆటోగ్రాఫర్ గా సత్యమ్ సూరన్ కి కూడా అవార్డులు వచ్చాయి.ఇవే కాకుండా ఇంకా ఈ సినిమాకు ఎన్నో విభాగాల్లో అవార్డులు వెల్లువెత్తాయి. అలా ఫిలింఫేర్ అవార్డ్స్ లో ఎక్కువ అవార్డ్స్ అందుకున్న సినిమాగా కూడా దసరా నిలిచింది. అలా దసరా సినిమాతో నాని ఎన్నో రికార్డులను తిరగ రాశారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: